• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టెంప్టింగ్ చేస్తున్న నా...

టెంప్టింగ్ చేస్తున్న నా ఇటుక.. నా అమరావతి

By - Tupaki Desk
Update: 2015-10-16 06:05 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐడియానే ఐడియా. నోటి మాటతోనే కాదు.. చేతలతో కూడా తాను అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. సీమాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో సీమాంధ్రులంతా కదలిరావాలని.. ప్రతి ఒక్కరూ ఒక్క ఇటుకకైనా తమ వంతుగా దానం చేయాలని.. అమరావతి నిర్మాణం సీమాంద్ర ప్రజల భాగస్వామ్యంలో జరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

దీనికి తగ్గట్లే  http://amaravati.gov.in/index.aspx  పేరిట వెబ్ సైట్ ను స్టార్ట్ చేశారు. ఒక్కో ఇటుక రూ10 చొప్పున విరాళం ఇచ్చే వీలుంది. అంటే.. అమరావతి నగరానికి విరాళం ఇచ్చేందుకు రూ.10 నుంచి మొదలు పెట్టొచ్చన్న మాట. ఇచ్చేది పది రూపాయిలే అయినప్పటికీ అమరావతిలో భాగస్వామిగా గుర్తిస్తూ పేర్కొనటం సంతోషాన్ని ఇవ్వటమే కాదు.. మరింత సాయం ఇవ్వాలన్న భావన కలిగేలా సైట్ డిజైన్ చేశారు.

అంతేకాదు.. భారీగా విరాళం ఇచ్చే వారికి సంబంధించిన ఫోటోల్ని కూడా ప్రచురించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక.. విరాళం ఇచ్చే ప్రతిఒక్కరి పేరు వెబ్ సైట్ లోనమోదు కావటమే కాదు.. వారికి కనిపించే అవకాశం ఉండటంతో.. విరాళాలు ఎంత వచ్చాయి. ఎంతమంది.. ఎంత ఇచ్చారన్న విషయంతో పాటు.. ఏ ప్రాంతానికి చెందిన వారు ఇచ్చారో కూడా తెలుస్తుంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా స్టార్ట్ అయిన ‘‘నా ఇటుక నా అమరావతి’’ వెబ్ సైట్లో ఇటుకల విరాళం జోరుగా సాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి ఈ వెబ్ సైట్ ద్వారా 4937 మంది 4,40,392 ఇటుకల్ని ఇచ్చారు.

అత్యధికంగా విరాళం ఇచ్చిన వారి విషయానికి వస్తే.. ఏపీ క్రెడాయ్ విరాళంగా ఇచ్చిన 52,200 ఇటుకల్ని ఇప్పటివరకూ ఎవరూ బ్రేక్ చేయలేదు కాకుంటే.. ఆలూరు శివరామ ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం 10,116 ఇటుకలు ఇచ్చిన క్రెడాయ్ తర్వాతి స్థానంలో నిలిచారు. ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట 5558 ఇటుకలు.. డాక్టర్ శ్రీనివాస్ గుళ్లపల్లి 5000 ఇటుకల్ని విరాళంగా ఇచ్చారు.

అంతేకాదు.. ఒక్క ఇటుకకు విరాళం ఇచ్చినా తాజాగా విరాళం ఇచ్చిన వారి పేర్లను స్క్రోలింగ్ ఇవ్వటం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇలా పేర్లు.. ఫోటోలు కూడా కనిపించేలా ఉన్న ‘‘నా ఇటుక నా అమరావతి’’ సైట్  చూసిన వెంటనే విరాళం ఇచ్చేలా టెంప్ట్ చేస్తుందనటంలో సందేహం లేదు.
Tags:    
  • My Brick My Amaravati 
  • Amaravati 
  • Andhra Capital 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS