మోడీ సర్కారుకు అర్థమయ్యే భాషలో తికాయత్ నోట కొత్త నినాదం
కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరిన తర్వాత ఇప్పటివరకు ఆయన ప్రభుత్వానికి సరైన సవాలు ఎదురుకాలేదు. మూడు వ్యవసాయ చట్టాలతో మొదలైన రచ్చ.. అంతకంతకూ పెరగటమే కాదు కేంద్రంలోని మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఈ ఆందోళన బీజేపీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోటీన్ కు భిన్నంగా.. అలవాటుగా ఉండే సంప్రదాయ ఆందోళనలకు.. నిరసనలకు భిన్నంగా సాగుతున్న ఈ పోరాటంలో ఇప్పుడు కొత్త నినాదం తెర మీదకు వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న పోరాటం వినూత్నంగా సాగుతోంది. దీనికి ఏ మాత్రం తక్కువ కాకుండా తాజాగా కొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ నినాదాన్ని చూస్తే.. బీజేపీకి అర్థమయ్యే భాషలో దీన్ని రూపొందించారని చెప్పాలి. ఇన్నాళ్లు బిల్ వాపసీ గురించి మాత్రమే మాట్లాడామని.. మరి గద్దీ వాపసీ (అధికారాన్ని వెనక్కి తీసుకునే) నినాదాన్ని యువత ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించుకోవాలని ప్రశ్నించారు.
భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ నోటి వెంట పలు ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. రోడ్లపై మేకుల్ని ఏర్పాటు చేసిన వైనాన్ని ప్రస్తావించిన తికాయత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం ఏఱ్పాటు చేసిన మేకులపై తాను పడుకొని.. ఇతర రైతులు తనపై సురక్షితంగా దాటి వెళ్లేలా చూస్తానన్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం తీవ్రమవుతోందని.. ఖాప్ పంచాయిత్ ల నుంచి లభిస్తున్న మద్దతు చూస్తుంటే.. కచ్ఛితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. రైతు ఉద్యమానికి అంతర్జాతీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించటం గర్వకారణమన్న వ్యాఖ్యను రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మోడీ సర్కారు ఉలిక్కిపడేలా తాజా నినాదం ఉందని చెప్పక తప్పదు.