మనదేశంలోనూ కొత్త స్ట్రెయిన్లు ఇవి చాలా డేంజర్​

Update: 2021-02-21 17:30 GMT
మనదేశంలో కరోనా ముప్పు పొంచిఉందని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా హెచ్చరించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కొత్త వేరియంట్​ వ్యాప్తి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది పాత వైరస్​ కంటే వేగంగా వ్యాపిస్తున్నదని.. ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. గతంలో కరోనా వచ్చినవాళ్లకు.. వ్యాక్సిన్​ తీసుకున్న వాళ్లకు కూడా కొత్త వేరియంట్​ సోకే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ట్రేసింగ్​, టెస్టింగ్​, ట్రీట్​ విధానాన్ని మరోసారి సీరియస్​గా అమలు జరపాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.


భారత్​లాంటి పెద్ద దేశంలో హెర్డ్​ ఇమ్యూనిటీ రావడం అంత ఈజీ కాదన్నారు. మన దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే జనాభాలో 80 శాతం మందిలో కోవిడ్ యాండీబాడీలు ఏర్పడాలన్నారు. ఇది అంత సులభం కాదని చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్​ కరోనా వ్యాక్సిన్లను గుర్తించినట్టు చెప్పారు.
దేశంలో పుట్టుకొచ్చిన కొత్త స్ట్రెయిన్లవల్లే కరోనా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో 240 కొత్త స్ట్రెయిన్‌లు ఉన్నాయని మహారాష్ట్ర కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పంజాబ్‌లో కేసులు పెరగడానికి కారణం అదేనని ఆయన చెప్పారు.


మనదేశంలో ఇప్పటికే వ్యాక్సినేషన్​ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిదశలో ఫ్రంట్​లైన్​ కారియర్స్​కు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. తొలి దశలో మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత దశలో 50 ఏళ్లు పైబడినవారు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తోంది. అయితే కొత్త స్ట్రెయిన్లపై వ్యాక్సిన్లు పనిచేస్తాయా? లేదా? అన్న విషయంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొన్నది.
Tags:    

Similar News