• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విచిత్రంగా అనిపించినా...

విచిత్రంగా అనిపించినా నిజం ఇదే.. అప్పుడు ఇప్పుడు సత్యమే సాక్షి

By - Tupaki Desk
Update: 2019-12-07 04:59 GMT
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. దిశను అత్యంత పాశవికంగా తగలబెట్టిన దుర్మార్గాన్ని చూసి.. పోలీసులకు సమాచారం ఇచ్చిన సత్యం గురించి అందరికి తెలిసిందే. రైతు అయిన సత్యం ప్రతి రోజూ తెల్లవారుజామునే పొలానికి వెళతారు. కొట్టంలో పాలుపితుక్కుని ఇంటికి వస్తుంటారు. రోజు చేసే పనిలో భాగంగా దిశను కాల్చేసిన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు అనుకోకుండా సత్యం కంట పడింది. దిశ మంటల్లో కాలిపోతున్న వైనాన్ని చూసి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇవ్వటం.. ఆ తర్వాత బయటకు రావటం తెలిసిందే.

విచిత్రమైన విషయం ఏమంటే.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత.. హతమైన నలుగురిని తొలుత చూసింది కూడా సత్యమే. దిశను తగలెట్టిన రోజున ఉదయం ఐదు గంటల వేళలో పొలానికి వెళుతున్న వేళ.. మంటను చూసి చలి మంటగా భావించారు. తర్వాత ఏడు గంటల సమయంలోనూ ఇంకా కాలుతూ ఉన్న వైనాన్ని చూసి.. అనుమానం వచ్చి చూడగా.. అది దిశదిగా అర్థమై వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

ఇక ఎన్ కౌంటర్ విషయానికి వస్తే.. ఎప్పటిలానే నిన్న (శుక్రవారం) ఉదయం ఐదు గంటలకు ఎప్పటిలానే కొట్టంలో పాలు పితికేందుకు వెళ్లాడు. ఆ సమయంలో కొందరు పోలీసులు అతన్ని అటు రావొద్దని.. తర్వాత రమ్మని సత్యాన్ని తిప్పి పంపారు. తర్వాత ఆరు గంటలకు వచ్చిన అతను తన పని తాను చేసుకొని వెళ్లిపోయాడు.

తనకు ఎదురైన ఉదంతాన్ని తన సోదరుడు వెంకటయ్యకు చెప్పారు సత్యం. దిశను కాల్చేసిన ప్రాంతం.. తాజాగా ఆ నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ అయిన ప్రదేశం.. రెండూ తమ భూముల్లోనేనని చెబుతున్నారు  వెంకటయ్య. తమకు 30 ఎకరాల పొలం ఉందని.. వరి.. టమోటా పంటలు పండిస్తామని చెబుతున్నారు.  మొత్తానికి రెండు ఉదంతాలను తొలుత చూసింది సత్యమే కావటం గమనార్హం.
Tags:    
  • Sathyam 
  • Witness 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS