• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ ఖమ్మం మాజీ మంత్రి 29న...

ఆ ఖమ్మం మాజీ మంత్రి 29న టీడీపీలోకి ఖాయం

By - Tupaki Desk
Update: 2022-12-27 14:30 GMT
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో 40 ఏళ్లుగా ఆయన పాత్ర కీలకం. ఓ దశలో ఉమ్మడి జిల్లా టీడీపీ మొత్తాన్ని తన కనుసైగతో నడిపించారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ నాయకత్వంలోనూ కలిసి కదిలారు. అలాంటి నాయకుడు 2018 ఎన్నికల తర్వాత అప్రాధాన్యం ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తలపండిన ఆయన.. ఈ పరిస్థితిని ఉక్కపోతగా భావిస్తున్నారు. అధికార పార్టీ నుంచి.. తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

బీఆర్ఎస్ అయ్యాక తొలి వికెట్ ఆయనే..

తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే. దసరా నాడు దీనికి అంకురార్పణ జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఢిల్లీ స్థాయిలో ఇతర పార్టీలతో సంప్రదింపుల ప్రయత్నాలు సాగుతున్నాయి. కాగా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు గత మూడేళ్లలో తెలంగాణ అధికార పార్టీ నుంచి పెద్దఎత్తున బీజేపీలోకి వలసలు సాగాయి. మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీలో చేరారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో, తర్వాత బీఆర్ఎస్ ఏర్పడ్డాక పరిస్థితులు మారాయి.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వెలుగులోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి
వెళ్లేవారు ఎవరూ కనిపించడం లేదు. అయితే, ఈ వ్యవధిలో టీడీపీ తెలంగాణ పూర్వ వైభవానిక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఖమ్మం జిల్లాలో ఇటీవల భారీ సభ నిర్వహించింది. దీంతోనే తెలంగాణలో టీడీపీకి ఇంకా నూకలు ఉన్నాయనే సంగతి తెలిసిపోయింది. ఈ ఊపును కొనసాగించేలా ఖమ్మం జిల్లా సీనియర్ నేత అధికార బీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి తిరిగి వస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఆయన ఒక్కరే టీడీపీలోకి పునరాగమనం చేస్తారా? లేక ఇద్దరు ముగ్గురు కీలక నాయకులనూ తనతో పాటు తీసుకువస్తారా? అన్నది కీలకంగా మారనుంది.

ఆయనొస్తే సమీకరణాలు మారిపోతాయ్..

ఖమ్మం జిల్లా సీనియర్ నేత గనుక టీడీపీలోకి పునరాగమనం చేస్తే ఆ ఉమ్మడి జిల్లాలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. తెలంగాణ టీడీపీ పగ్గాలను ఇటీవల కాసానికి అప్పగించి స్పీడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇదే క్రమంలో పార్టీ బలోపేతంపైనా ఆలోచనలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ మాజీ మంత్రి గనుక టీడీపీలోకి వస్తే సమీకరణాలు చాలావరకు మారిపోతాయి. ఉమ్మడి ఖమ్మంతో పాటు వారి సామాజికవర్గం
అధికంగా ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలను ఆ మాజీ మంత్రి తన ప్రభావంతో నియంత్రించగలరు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారబోతోంది.

ఆ మాజీ మంత్రి జనవరి 29న హైదరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో టీడీపీలోకి తిరిగి వస్తారని కచ్చితంగా చెబుతున్నారు. తెలంగాణలో బలపడి.. ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీని.. ఆంధ్రాలో తన దారిలోకి తెచ్చుకోవాలనే వ్యూహంతో ఉన్న చంద్రబాబుకు ఆ మాజీ మంత్రి టీడీపీలో చేరిక పెద్ద బలాన్నిచ్చేదే కానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Khammam 
  • telangana 
  • tdp 
  • brs 
  • formerminister 
  • latestnews 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS