• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రాక్టర్ల ర్యాలీలో...

ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు..రైతు మరణం - మృతదేహంతో అక్కడే బైఠాయించిన రైతులు

By - Tupaki Desk
Update: 2021-01-26 12:00 GMT
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలంటూ గత కొన్ని రోజులుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇక ఈ ఆందోళనల్లో భాగంగా నేడు రైతులు ట్రాక్టర్ల తో ర్యాలీ నిర్వహించదలిచారు. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ జరుగుతున్న సమయంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీకి పూనుకోవడంతో ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఐటీవో జంక్షన్ వద్ద ఆందోళనలో పాల్గొన్న 46 ఏళ్ల ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన పోలీసులు, రైతుల మధ్య ఘర్షణకు దారితీసింది.

పోలీసుల బుల్లెట్ తగలడం వల్లే రైతు మరణించాడని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. రైతు మృతదేహంతో ఐటీవో జంక్షన్ వద్ద బైఠాయించారు. అయితే ట్రాక్టర్‌ పైనుంచి పడటం వల్ల ఆ రైతు మరణించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అనుమతి లేని మార్గాల్లో ప్రవేశించిన రైతులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, రైతులు వారి ట్రాక్టర్లను తమ మీదకి ఉరికించారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌పై ఉన్న ఓ రైతు ప్రమాదవశాత్తూ కిందపడ్డాడని చెప్పారు. తలకు బలమైన గాయం కావడంతో ఆ రైతు మరణించి ఉంటాడని తెలిపారు.

మరోవైపు పోలీసుల నిర్బంధాన్ని చేధించి ఎర్రకోటకు చేరుకున్న రైతులను అక్కడి నుంచి పంపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను అక్కడ నుంచి తరిమేయడానికి ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రైతులు ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట బురుజుల పైకి చేరి జెండాలు ఎగరేశారు.అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య హింసాత్మకంగా రైతుల ర్యాలీ మారింది.

రిపబ్లిక్ డే పరేడ్‌ కంటే ముందే ఉదయం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి భారీగా చేరుకున్నారు. వారిని నిరోధించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రైతులు బారికేడ్లు దాటే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నిరోధించే క్రమంలో భాష్పవాయిగోళాలు, లాఠీలకు పోలీసులు పని చెప్పారు. ఇక నిరసనకారులు కూడా పోలీసులపై పలు చోట్ల దాడులకు తెగబడ్డారు.
Tags:    
  • Farmers 
  • Tractor rally 
  • Republic Day 
  • Latest News 
  • Political news 
  • Tupaki Updates 
  • Daily Reports 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS