• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మిస్ అయిన మంత్రిగారి...

మిస్ అయిన మంత్రిగారి కడియం దొరికేసిందోచ్..

By - Tupaki Desk
Update: 2020-02-15 09:29 GMT
చూసేందుకు చిన్నగా అనిపించే కొన్ని విషయాలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటిదే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెంటిమెంట్ కడియం.. నాటకీయ పరిణామాల మధ్య మిస్ కావటం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా దేవర కద్ర లో జరిగిన పెళ్లి వేడుక కు మంత్రివర్యులు హాజరు కావటం.. ఆయనతో సెల్ఫీల కోసం పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం కావటం తెలిసిందే.

వారి ఉత్సాహం చూసిన శ్రీనివాస్ గౌడ్ మురిసి పోయి.. ఫోటోలకు ఫోజులు ఇవ్వటం.. అంతా అయ్యాక చూసుకుంటే చేతికి ఉండే  సెంటిమెంట్ కడియం మిస్ అయిన విషయం తెలిసి చిందులు తొక్కారు. చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది.. వ్యక్తిగత సిబ్బంది ఇలాంటివి గమనించరా? అంటూ ఫైర్ అయ్యారు. సెంటిమెంట్ కడియం మిస్ కావటాన్ని జీర్ణించుకో లేని ఆయన.. పోయిన కడియం ఎవరికైనా దొరికితే.. దాన్ని తిరిగి ఇస్తే రూ.లక్ష నజరానాను ప్రకటించారు కూడా.

మంత్రిగారి ప్రకటన బాగానే వర్క్ వుట్ అయ్యింది. కడియం పోయిందన్న విషయంపై పలువురు సీరియస్ గా తీసుకొని వెతకగ్గా.. దేవరకద్రకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి దొరికింది. ఆ వెంటనే హైదరాబాద్ కు హుటాహుటిన బయలుదేరిన ఆయన.. మంత్రి గారి వద్దకు స్వయంగా వెళ్లి.. సదరు కడియాన్ని అప్పగించారు. జరిగిన దానికి చింతించినట్లుగా తెలిసింది. మంత్రిగారి కడియం దొరకటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రకటించిన రూ.లక్ష నజరానా ను కడియం తీసుకొచ్చిన వ్యక్తికి అప్పగించారా? అన్న క్వశ్చన్ కు మాత్రం ఆన్సర్ దొరకటం లేదు.
Tags:    
  • Telangana Minister Srinivas Goud Gets His Sentiment Kadiyam Back 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Daily News 
  • Telugu News 
  • Telugu Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS