• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అయ్యో పాపం.. చావు రాసి...

అయ్యో పాపం.. చావు రాసి పెట్టిందన్నట్లుగా చచ్చిపోయారే..

By - Tupaki Desk
Update: 2020-02-17 04:35 GMT
రాసి పెట్టిన మరణాన్ని ఎవరూ ఆపలేరన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజా ఉదంతం వింటే ఈ మాటను కొట్టి పారేయలేరు. తమ దారిన తాము పోతున్న కారును వెనుక నుంచి లారీ గుద్దటం ఏమిటి? 200 మీటర్ల ఎత్తు మీద నుంచి కారు బండరాళ్ల మీద పడటం ఏమిటి? ఈ ప్రమాదం గురించి తెలిసి.. అక్కడి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు వచ్చిన కానిస్టేబుల్ జారి పడి మరణించటం ఏమిటి? వరుస పెట్టి చోటు చేసుకున్న మరణాలు చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఈ ప్రమాదం గురించి విన్నవారంతా ఉలిక్కి పడటమే కాదు.. ఇలా జరగటమేమిటన్న విస్మయానికి గురి చేసే ఈ ఉదంతంలోకి వెళితే..

కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్.. స్వరూపలు భార్యభర్తలు. శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తుంటారు. ఆదివారం కావటంతో కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం కోసం భార్యతో కలిసి ఉదయం తొమ్మిది గంటలకు కారులో ఇంటి నుంచి బయలుదేరారు. కారు మానేరు వంతెనపైకి చేరుకునే వేళకు.. కరీంనగర్ నుంచి వస్తున్న లారీ వేగంగా కారు వెనుక భాగాన్ని ఢీ కొట్టింది.

ఈ వేగానికి కారు అదుపు తప్పి మానేరు వంతెన రెయిలింగ్ ను ఢీ కొంది. హటాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటనలో కారు వంతెన పై నుంచి 200 మీటర్ల లోతులో ఉన్న బండరాళ్ల మీద పడిపోయింది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించారు. భార్య స్వరూపా గాయ పడింది. ప్రమాదం జరిగిన వెంటనే.. అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కరీంనగర్ వన్ టౌన్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఘటనా  స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న ట్రాఫిక్ ను నియంత్రించే ప్రయత్నం చేస్తుండగా.. పొరపాటున వంతెన పై నుంచి కిందకు పడిపోయారు. దీంతో.. అతను తీవ్రంగా గాయపడ్డారు. 108లో గాయపడిన స్వరూప.. కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఇద్దరిని తరలించగా.. మార్గమధ్యంలోనే పోలీసు కానిస్టేబుల్ మరణించాడు. దైవ దర్శనం కోసం వెళుతూ ఒకరు.. ప్రమాదాన్ని పర్యవేక్షించేందుకు వచ్చిన పోలీసు కానిస్టేబుల్ మరణం అక్కడి వారిని కలిచివేసింది.
Tags:    
  • Telangana cop visits accident spot to oversee rescue 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Daily News 
  • Telugu News 
  • Telugu Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS