• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇప్పుడు కేసీఆర్.. 'సో...

ఇప్పుడు కేసీఆర్.. 'సో హ్యాపీ' అట

By - Tupaki Desk
Update: 2016-10-21 06:20 GMT
సమయం చూసుకొని తమ అధిక్యతను.. అధిపత్యాన్ని తెలివిగా ప్రదర్శించుకోవటం కొందరు నేతల్లో కనిపిస్తుంది. అలాంటి వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని సహజంగానే ఆయన విధేయులు తరచూ పొగిడేస్తుంటారు. అయితే.. కేసీఆర్ లో కనిపించే కోణం ఏమిటంటే.. అవసరానికి తగ్గట్లుగా తనను తానే పొగిడేసుకుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తనను తాను పొగిడేసుకున్నా.. ఎబ్బెట్టుగా లేకుండా ఉండటం కేసీఆర్ గొప్పతనంగా చెప్పాలి.

తాజాగా  క్యాంపు కార్యాలయంలో పోచమ్మ ఆలయాన్ని పున:ప్రతిష్టించిన కార్యక్రమం తర్వాత సీఎంవో అధికారులతో.. ప్రజాప్రతినిధులతో కేసీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాల్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తానెంతో హ్యాపీగా ఉన్నట్లుగా చెప్పిన ఆయన.. అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయగలిగామని.. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లినట్లుగా అభివర్ణించారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలనే కాదు.. ఇవ్వని హామీలను కూడా పూర్తి చేసినట్లుగా తేల్చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మొత్తంగా తీర్చేసినట్లుగా ఆయన వ్యాఖ్యానించి.. టార్గెట్ పెట్టుకొని పని చేయటం మొదలు పెడితే.. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి అవుతుందని.. కొత్త జిల్లాల్ని దసరా రోజు ప్రారంభించాలని అనుకోవటంతో అనుకున్న సమయానికి పని పూర్తి అయినట్లుగా ఆయన వెల్లడించారు.

మిషన్ భగీరథ మొదటిదశను విజయవంతంగా పూర్తి చేశామని.. రానున్న రోజుల్లో ఇంటింటికీ తాగునీటి అందించే కార్యక్రమాన్ని కూడా టార్గెట్ పెట్టుకొని పూర్తి చేద్దామన్న కేసీఆర్.. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. కొత్త సెక్రటేరియట్.. కళాభారతి.. లాంటి వాటిని కూడా పూర్తి చేయనున్నట్లుగా చెప్పారు. చూస్తుంటే.. ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్న కేసీఆర్.. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న విషయాలేవీ పట్టించుకున్నట్లుగా కనిపించట్లేదులా ఉంది. కొత్తజిల్లాల్లో తమ మండలాలు ప్రజలు కోరుకున్నట్లుగా లేవంటూ ఇద్దరు ఆత్మహత్య చేసుకోవటం లాంటి విషాద ఘటనలు కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లుగా లేవు. సంతోషంతో ఉన్నప్పుడు.. విషాదాల గురించి మర్చిపోవటం.. వాటిని గుర్తించకపోవటం ఎప్పుడూ జరిగేదే. ఇదే కేసీఆర్ అధికారంలో కాకుండా.. ఉద్యమనేతగా ఉండి ఉంటేనా..?
Tags:    
  • Telangana CM KCR 
  • Telugu News 
  • Telangana Politics 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS