దెబ్బకి ఠా!.. ఇప్పుడు టీడీపీ త‌మ్ముళ్ల‌కి చుక్క‌లే..!

Update: 2020-05-06 10:10 GMT
ఏపీలో గ‌డిచిన రెండు రోజులుగా రాజ‌కీయాలు తీవ్ర‌స్థాయిలో ఊపందుకున్నాయి. ఏపీ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌లు దుమ్మెత్తి పోశారు. లాక్‌డౌన్ మూడో ద‌శ నేప‌థ్యంలో కేంద్రం ఇచ్చిన స‌డ‌లింపుల మేర‌కు రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంది. వీటిలో ప్ర‌ధానంగా మ‌ద్యం దుకాణాలు తెర‌వ‌డం. ఈ క్ర‌మంలోనే మ‌ద్యం ధ‌ర‌ల‌ను పెంచ‌డం. ఈ రెండు విష‌యాల‌పైనా టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా త‌మ్ముళ్లు కూడా జ‌గ‌న్ స‌ర్కారును తీవ్ర‌స్థాయిలో టార్గెట్ చేశారు. నిజ‌మే.. వ‌చ్చిన అవ‌కాశాన్ని ఏ ప్ర‌తిప‌క్షం మాత్రం వ‌దులుకుంటుంది. ఓ రేంజ్‌లో ఉతికి ఆరేశారు.

ఏం కొంపలు అంటుకుపోయాయని మద్యం షాపులను తెరిచారని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రమైనా మద్యం దుకాణాలను తెరిచిందా అని ప్రశ్నించారు. పైగా వాళ్లెవరూ సంపూర్ణ మద్య నిషేధం గురించి చెప్పలేదు. మీరు ప్రజలకు వాగ్దానం చేశారు. మిగిలిన రా ష్ట్రాలతో ఎలా పోల్చుకుంటారు అని ధ్వజమెత్తారు. పోలీసులను పెట్టి మరీ ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కరోనా వైర్‌సను కట్టడి చేయడమా లేక పెంచడమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు 40 రోజులు ఇళ్లలోనే ఉండి త్యాగం చేశారు. వారి త్యాగాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంద‌ని బాధ‌ప‌డ్డారు.

దీంతో ఒక‌ర‌కంగా ప్ర‌భుత్వం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింద‌నే చెప్పాలి. వెంట‌నే లైన్‌లోకి వ‌చ్చిన మంత్రి పేర్ని.. కేంద్రం అమ్మ‌మంది కాబ‌ట్టే తాము దుకాణాలు తెరిచామ‌ని చెప్పారు. కానీ, ఇంత‌లోనే ఓ ఘ‌ట‌న జ‌రిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మ‌ద్యం దుకాణాల‌కు ఓకే చెప్పారు. అక్క‌డ కూడా 16 శాతం పెంచుతున్న‌ట్టు వెల్ల‌డించారు. అంతేకాదు, రెడ్ జోన్ల‌లో కూడా మందు అమ్ముతున్న‌ట్టు వెల్ల‌డించారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీ బ్యాచ్‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. నిన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌ను చూపించి ఆద‌ర్శంగా ఉంద‌నే అభిప్రాయంతో ఏపీని ఏకేస్తున్నాం.. ఇప్పుడు తెలంగాణ కూడా షాపులు తెరిచింది.. ఇప్పుడు ఎలా స్పందించాల‌నే చ‌ర్చ‌లో మునిగిపోయారు.

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ వైర‌స్ వ్యాప్తి, క‌ట్టుదిట్టాల‌పై ఇటీవ‌ల మీడియాతో మాట్లాడిన సంద‌ర్బంగా .. వైర‌స్ ‌తోనే స‌హ‌జీవ‌నం చేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. అంతేకాదు, క‌రోనా ఇప్ప‌ట్లో పోయే అవ‌కాశం కూడా లేద‌న్నారు. దీనిపైనా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏకంగా ప్ర‌జ‌ల‌కు లేఖ రాశారు. పాల‌న ఇంత దౌర్భాగ్యంగా ఉంటుంద‌ని అనుకోలేద‌న్నారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆయ‌న ఉన్న హైద‌రాబాద్‌లోనూ ప్ర‌భుత్వం ఇదే ప్ర‌క‌టించింది. తాజాగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌.. క‌రోనా ఇప్ప‌ట్లో పోద‌న్నారు. క‌రోనాతో క‌లిసి జీవించాల్సి ఉంటుంద‌ని చెప్పారు. దీంతో మ‌ళ్లీ టీడీపీ నేత‌లు డోలాయ‌మానంలో ప‌డ్డారు. అటు ఏపీని విమ‌ర్శిస్తే.. తెలంగాణ‌తో చిక్కు వ‌స్తుంది! ఇప్పుడు కిం క‌ర్త‌వ్యం అంటూ.. త‌ల ప‌ట్టుకుంటున్నారు. మొత్తానికి టీడీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందంగా మారిపోయింద‌ట ప‌రిస్థితి.
Tags:    

Similar News