• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో టీడీపీ ఆఫీసు...

ఏపీలో టీడీపీ ఆఫీసు తగలబెట్టారు...

By - Tupaki Desk
Update: 2019-08-11 08:17 GMT
ఎందుకో గుంటూరు సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసులకు కాలం కలిసిరావట్లేదు. సత్తెనపల్లిలో రెండు తెలుగుదేశం ఆఫీసులు ఉన్నాయి. ఒకటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ది కాగా - మరొకటి పార్టీ ఆఫీసు. పాత ఆఫీస్ ముందు నుంచి ఉంది. అక్క‌డ ఎవ‌రు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆ ఆఫీస్ నుంచే పార్టీ కార్య‌క‌లాపాలు కొన‌సాగేవి. అయితే కోడెల ఎమ్మెల్యే అయ్యాక త‌న క్యాంప్ ఆఫీస్‌ నే పార్టీ ఆఫీస్‌ గా మార్చేశారు. ఆయ‌న మార్చారు అన‌డం కంటే ఆయ‌న త‌న‌యుడు కోడెల శివ‌రాం ప్ర‌సాద్ పాత నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టే - పాత ఆఫీస్‌ ను ప‌క్క‌న పెట్టించేశారు.

అయితే ఎన్నికల సమయంలో కోడెలకి టికెట్ ఇవ్వకూడదని కోడెల వ్యతిరేక వర్గం పార్టీ ఆఫీసుల్లో ఆందోళనలు చేశారు. అలాగే అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసేసి కుర్చీల‌ను ఇరగ్గొట్టేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాక నియోజకవర్గానికి కోడెల నాయకత్వం వద్దు అంటూ కొందరు నేతలు పార్టీ ఆఫీసుల్లో మీటింగులు పెట్టారు. కోడెల వర్గం ఏమో వారి ఆఫీసులో - వ్యతిరేక వర్గం ఏమో పాత పార్టీ ఆఫీసులో మీటింగులు పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా సత్తెనపల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఒక ఆఫీసుని గుర్తు తెలియని దుండగులు కొందరు తగలబెట్టారు.

స‌త్తెన‌ప‌ల్లి మండ‌లంలోని క‌ట్ట‌మూరులో టీడీపీ ఆఫీస్ పాక్షికంగా దెబ్బ‌తింది. అయితే ఈ పని చేసింది అపోజిషన్ పార్టీ వాళ్ళా - లేక సొంత పార్టీ నేతలా అనేది తెలియాల్సి ఉంది. మామూలుగా టీడీపీ-వైసీపీలు వైరి పక్షాలుగా ఉన్నాయి కాబట్టి ఈ పని వైసీపీ వాళ్లే చేసేవారు అనుకోవచ్చు. కానీ సత్తెనపల్లి టీడీపీలోనే రెండు శత్రు పక్షాలు ఉండటంతో వారిలో వారే ఈ పని చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి. కోడెల వర్గం  - కోడెల వ్యతిరేక వర్గమో ఈ పని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆఫీసు తగలబెట్టడంపై స్థానిక టీడీపీ నేతలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి ఈ విచారణలో ఎవరు నిందితులుగా తేలుతారో చూడాలి.


Tags:    
  • TDP Office 
  • Sattenapalli 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS