• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీడీపీ కొత్త వ్యూహం:...

టీడీపీ కొత్త వ్యూహం: రాజధానిపై ప్రజా బ్యాలెట్

By - Tupaki Desk
Update: 2020-02-27 06:45 GMT
ప్రస్తుతం టీడీపీ నాయకులు అధికార పార్టీపై విమర్శల జోరు పెంచారు. పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విమర్శల ఘాటు పెంచారు. ముఖ్యంగా రాజధాని తరలింపుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించి రాజధాని ప్రాంతమంతా విశాఖపట్టణానికి తరలించాలని నిర్ణయించడంపై టీడీపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. కావాలంటే నిరూపిస్తామని సవాల్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తామని ఆ పార్టీ ప్రకటించింది.

తాజాగా టీడీపీ నాయకులు మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం తెలుగుదేశం పార్టీ ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తుందిట. చంద్రబాబు ఇప్పటికే ప్రారంభించిన ప్రజాచైతన్య యాత్ర లో భాగంగానే.. ప్రజాభిప్రాయ సేకరణకు కూడా బ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ అధినేత పర్యటిస్తున్న ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని చోట్ల ఈ ప్రజాబ్యాలెట్ చేపడతారంట. తెలుగుదేశం నాయకులు, నాయకులు రాజధాని వికేంద్రీకరణపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని చెబుతామని, ఆ సర్వేలో అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ వస్తాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.  

అధికార వికేంద్రీకరణ విశాఖపట్టణం, విజయనగరం, కర్నూలులకు చేయడంతో దీనిపై ఆయా ప్రాంతాల స్థానిక నాయకులతో కలిసి తాము ప్రజాబ్యాలెట్ చేస్తామని టీడీపీ ప్రకటించింది. ఈ ప్రజాబ్యాలెట్ లో అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కొనసాగాలని ప్రజలు చెబుతారని ఆ నాయకులు పేర్కొంటున్నారు. దీనిపై చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా అభిప్రాయ సేకరణ చేస్తారట. యాత్ర పూర్తయ్యేలోపు సర్వే చేసి ఆ వివరాలను వెల్లడిస్తామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరీ టీడీపీ చేస్తున్న ఈ ప్రజా బ్యాలెట్ లో సాధారణం గా అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తుంటుంది. అయితే ఈ ప్రజా బ్యాలెట్ అనేది వైఎస్సార్సీపీ గెలిచిన నియోజకవర్గంలో కూడా ఈ ప్రజాబ్యాలెట్ చేయాలని అధికార పార్టీ నాయకులు సవాల్ విసురుతున్నారు. రాజధాని ప్రాంతంలోనే కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా చేస్తే వాస్తవమేమిటో తెలుస్తుందని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. మరీ ఈ ప్రజా బ్యాలెట్ ను ఎలా చేపడతారో.. దానిలో వాస్తవ ఫలితాలు చెబుతారా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    
  • Telugu Desam 
  • Chandra Babu Naidu 
  • Telugu Yuvatha 
  • Andhra News 
  • Andhra Political Updates 
  • Andhra Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS