• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సప్తగిరి సర్కిల్ లో...

సప్తగిరి సర్కిల్ లో అసలేమైంది..?

By - Tupaki Desk
Update: 2016-06-06 04:43 GMT
ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న రైతు భరోసాయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయటం తెలిసిందే. ఈ యాత్ర సందర్భంగా జగన్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో.. జగన్ యాత్రను నిలువరించేందుకు.. జగన్ ను తమ నిరసన తెలియజేసేందుకు తెలుగుదేశం శ్రేణులు విపరీతంగా ప్రయత్నించాయి. ఇందులో భాగంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లా పర్యటనలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనా అనంతపురం పట్టణంలోని సప్తగిరి సర్కిల్ వద్ద మాత్రం ఆందోళన కలిగించే అంశాలు చోటు చేసుకోవటం గమనార్హం.

అనంతపురం పట్టణంలో జగన్ పర్యటన సందర్భంగా సప్తగిరి సర్కిల్ దగ్గర పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు..  కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు నిలువరించే ప్రయత్నాన్ని టీడీపీ కార్యర్తలు చేసే ప్రయత్నంచేశారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సప్తగిరి సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున జమ అయిన జగన్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి దిగినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యాలు చెబుతున్నారు.

అయితే.. దీనిపై టీడీపీ నేతల వెర్షన్ వేరుగా ఉంది. తమ అధినేతపై వివాదాస్ప వ్యాఖ్యలు చేస్తున్న జగన్ కు నిరసన తెలిపేందుకు తాము వెళితే.. జగన్ పార్టీ నేతలు అనుచితంగా వ్యవహరించారని.. దాడికి దిగారని.. వారిని ప్రతిఘటించే క్రమంలో తమ కార్యకర్తలకు గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. ఇదే ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వెర్షన్ వేరుగా ఉంది. సప్తగిరి సర్కిల్ దగ్గరకు వచ్చే తమ అధినేతకు స్వాగతం పలికేందుకు తాము ఉంటే.. టీడీపీ శ్రేణులు తమపై వచ్చి రావటంతోనే దాడులు చేసినట్లుగా ఆరోపిస్తున్నారు.

ఇరువర్గాల మధ్య దాడులు మొదలై.. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలోపోలీసులు జోక్యం చేసుకొని.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొంతమంది టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అక్కడ నుంచి తరలించినట్లుగా చెబుతున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడిన జగన్ పార్టీ కార్యకర్తల్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏమైనా అనంతపురం జిల్లాలో జరిగిన జగన్ పర్యటనలో మరెక్కడా చోటు చేసుకోని విధంగా సప్తగిరి సర్కిల్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని చెప్పొచ్చు.
Tags:    
  • TDP 
  • YSRCP Activists 
  • Anantapur saptagiri Circle 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS