• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కూట‌మి లెక్క...

కూట‌మి లెక్క తేలింది..ర‌చ్చ మిగిలింది

By - Tupaki Desk
Update: 2018-11-08 15:47 GMT
డైలీ సీరియ‌ల్‌ను మించిన ఉత్కంఠ‌తో కొన‌సాగిన మ‌హాకూట‌మి సీట్ల పంప‌కం లెక్క తేలింది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ మిగ‌తా ప‌క్షాల‌తో జ‌ట్టుక‌ట్టి ఏర్పాటుచేసిన ప్ర‌జా కూట‌మి ఎట్ట‌కేల‌కు త‌మ‌న పంప‌కాల ప‌ర్వాన్ని పూర్తి చేసింది. కూట‌మిలోని ఏ పార్టీల్లో ఎవ‌రెవ‌రు పోటీచేయాలో త్వ‌ర‌లో తేల‌నుంది.  గురువారం రాహుల్ నివాసంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఈ భేటీలో కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేయనుంది. 26 సీట్లను మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ ఖుంతియా ప్రకటించారు. 10న ఉదయం తొలి జాబితాను విడుదల చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ఉమ్మడి ఎజెండాతో జత కట్టిన మహా కూటమి సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాక‌పోవ‌డం, మ‌రోవైపు నామినేషన్ల సమయం దగ్గర పడుతుండటంపై కూటమి భాగస్వామి పార్టీల నేతల్లో గందరగోళం నెలకొంది. ఈ స‌మ‌యంలోనే సీపీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటులో ఆలస్యమవడంతో తాము బరిలోకి దిగే 9 స్థానాలను సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఇవాళ ప్రకటించారు. మ‌రోవైపు టీజేఎస్ సైతం త‌న‌దారి తాను చూసుకుంటుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ జాగ్ర‌త్త ప‌డి ఢిల్లీలో స‌మావేశం ఏర్పాటుచేసింది. తాజాగా జ‌రిగిన స‌మావేశం అనంత‌రం వెలువ‌రించిన వివ‌రాల ప్ర‌కారం కాంగ్రెస్ ఎట్ట‌కేల‌కు ఓ నిర్ణ‌యం తీసుకుంది.

మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు సీట్ల‌ను కేటాయించింది. దీని ప్ర‌కారం 26 సీట్లలో టీడీపీకి 14 - టీజేఎస్ కి 8 - సీపీఐకి 3 సీట్లను కేటాయించారు. ఒక స్థానం తెలంగాణ ఇంటి పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 10న మహాకూటమి మొదటి జాబితా విడుదల కానుంది.  74 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కానుంది. మిగిలిన 20 మంది జాబితా రెండో జాబితాలో విడుదలవుంది. దీనికోసం ఈ నెల 11 - 12 న మరో విడుత కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది సీపీఐకి వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లిలను ఖరారు చేసింది. రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.
Tags:    
  • Telangana Congress 
  • Kuntiya 
  • Maha Kutami Seats 
  • Telugu News 
  • Telangana Politics 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS