ఈటలకు శస్త్ర చికిత్స.. పాదయాత్రకు బ్రేక్?

Update: 2021-08-02 23:30 GMT
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కు శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు తేల్చడంతో ఆయన పాదయాత్రకు బ్రేక్ పడేలానే కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఈటల రాజేందర్ అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నాడు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అస్వస్థతకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు తాజాగా ఆయన మోకాలికి సమస్య ఉందని గుర్తించి శస్త్రచికిత్స చేశారు. వారం రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.

10 రోజులు గడిస్తే తప్ప ఈటల తన పాదయాత్రపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు. దీంతో ఈటల ప్రజా దీవెన పాదయాత్ర కొనసాగుతుందా? లేదా శాశ్వత బ్రేక్ పడుతుందా? అన్న సందిగ్ధం నెలకొంది.

సాధారణంగా మోకాలి సర్జరీ అయిన తర్వాత వైద్యులు కొంతకాలం బెడ్ రెస్ట్ సూచిస్తారు. ఒకవేళ త్వరగానే కోలుకున్నా ఎక్కువ దూరం నడిచే రిస్క్ చేయవద్దని చెబుతారు. అలా చేస్తే సమస్య మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు బెడ్ రెస్ట్ లోనే ఉండమని చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ ఆస్పత్రి నుంచి వచ్చాక పాదయాత్ర చేయడం అనుమానమే అన్న వాదన వినిపిస్తోంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల  స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లోని నిమ్స్ కు ఆయనను తరలించారు. బీపీ పడిపోవడంతో ఆపోలో ఆస్పత్రికి తీసుకెళుతున్నామని వైద్యులు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అందరికంటే ముందే ఈటల రాజేందర్ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.నియోజకవర్గంలో 'ప్రజాదీవెన' పాదయాత్రను చేపట్టారు. ఈ క్రమంలోనే ఊరువాడ పొలాల వెంబడి తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈటల కాళ్లకు పొక్కులు, జ్వరం రావడంతో పాదయాత్రలో  ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల నుంచి మధ్యాహ్న భోజన విరామం సమయంలో ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.షెడ్యూల్ ప్రకారం రెండు గ్రామాల్లో ఈటల సతీమణీ జమున తాజాగా పాదయాత్ర చేపట్టారు. ఈటలకు బదులుగా ఆమె పాదయాత్ర చేపట్టారు.

గురువారం జమ్మికుంట మండలం విలాసాగర్, పాపయ్యపల్లి, బిజిగిరిషరీఫ్, వెంకటేశ్వర్ల పల్లి , కాపులపల్లి, కోరపల్లి, సైదాబాద్ గ్రామాల్లో ప్రజాదీవెన పాదయాత్ర కొనసాగింది.
Tags:    

Similar News