• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సినిమా హాళ్ల‌ల్లో జాతీయ...

సినిమా హాళ్ల‌ల్లో జాతీయ గీతం..పున‌రాలోచ‌న‌లో సుప్రీం

By - Tupaki Desk
Update: 2017-10-23 17:24 GMT

త‌న తీర్పును స‌మీక్షించుకునేందుకు స‌ర్వోన్న‌త న్యాయస్థానం ముందుకు వ‌చ్చింది. సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరి అని - ఆ సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలన్న గతేడాది తీర్పును పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తంచేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. మోరల్ పోలీసింగ్‌ కు ఫుల్‌ స్టాప్ పడాల్సిందేనని, ప్రతి ఒక్కరూ ఎప్పుడూ తమ భుజాలపై దేశభక్తిని మోయాల్సిన అవసరం లేదని ఈ బెంచ్ అభిప్రాయపడింది. థియేటర్లలో జాతీయ గీతం పాడనంత మాత్రాన వాళ్లు జాతి వ్యతిరేకులు కారని సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది.

ప్రతి థియేటర్‌లో సినిమా మొదలయ్యే ముందు జాతీయ గీతం వేయాలని - ప్రేక్షకులంతా లేచి నిలబడాల్సిందే అని గతేడాది సుప్రీం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దాఖ‌లైన పిటిష‌న్‌ పై విచార‌ణ చేస్తూ ``జాతీయ గీతం సమయంలో అందరూ కచ్చితంగా లేచి నిలబడాలని అనుకున్నపుడు ఎందుకు దాని కోసం ప్రత్యేకంగా నిబంధనలను రూపొందించడం లేదు?``  అని సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. గతేడాది నవంబర్‌లో సినిమా హాళ్లలో జాతీయ గీతంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై జస్టిస్ డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. `ఈ తీర్పును ఉల్లంఘిస్తే జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తారని ప్రజలు భయపడుతున్నారు. వాళ్లు సినిమా హాళ్లకు వచ్చేది కేవలం వినోదం కోసమే. వాళ్లకు అదే కావాలి. మోరల్ పోలీసింగ్ కాదు` అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అంగ వైకల్యం ఉన్నవారిని ఇందులోంచి మినహాయిస్తూ తమ తీర్పును కాస్త సవరించింది. ఇప్పుడు థియేటర్లలో జాతీయ గీతంపై కొత్తగా ఆర్డర్ ఇవ్వాలా వద్దా అన్నదానిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది.
Tags:    
  • Supreme Court 
  • National Anthem 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS