• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సుప్రీం తేల్చేసింది.....

సుప్రీం తేల్చేసింది.. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష

By - Tupaki Desk
Update: 2017-02-14 05:28 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం అర్రులుచాస్తూ వారం రోజులుగా పట్టువీడకుండా ప్రయత్నాలు చేస్తున్న శశికళ సీఎం కలలకు బ్రేకులు పడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు సుప్రీం కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. దీంతో ప్రస్తుతం శశికళ ముఖ్యమంత్రి పీఠానికి అనర్హురాలిగా మారింది. ఇప్పుడు తమిళ రాజకీయం ఎలా మారుతుందో.. పన్నీర్  కు రూటు క్లియర్ అవుతుందో.. లేదంటే శశికళ శిబిరం నుంచి రెండో క్రుష్ణుడెవరైనా వస్తారో చూడాలి.
    
ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. శశికళకు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ - జస్టిస్‌ అమిత వరాయ్‌ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శశికళను దోషిగా నిర్ణయించడంతో అనుకున్నంతా అయింది. ఈ  కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న శశికళకు శిక్ష విధించాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
    
జస్టిస్ పినాకి చంద్రఘోష్ తీర్పును చదువుతూ, ఈ కేసు తీవ్రమైనదని వ్యాఖ్యానించారు. చట్టాన్ని మీరి ప్రవర్తించినట్టు స్పష్టమవుతోందని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా దోషులేనని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.
    
కాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 15వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రాజ్‌ భవన్‌ - పోయెస్‌ గార్డెన్‌ - పన్నీర్‌ సెల్వం నివాసం - పార్టీ కార్యాలయాలు - గోల్డెన్‌ బే రిసార్ట్స్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ  కేసులో సహ నిందితులుగా శశికళ - ఇళవరసి - సుధాకరన్‌ ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Supreme Court 
  • Sasikala 
  • DA case 
  • Four Years Jail 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS