• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్ర‌బాబుతో సుభాష్ ఘ‌య్...

చంద్ర‌బాబుతో సుభాష్ ఘ‌య్ భేటీ!

By - Tupaki Desk
Update: 2017-09-05 13:52 GMT
ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ప్ర‌ముఖ‌ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘ‌య్ మంగళవారం మధ్యాహ్నం అమరావతిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ ఇన్‌ స్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకుగాను ప్రభుత్వ పరంగా సహకారం అందించాలని చంద్రబాబును సుభాష్ ఘ‌య్ కోరినట్లు సమాచారం. ఈ ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు కూడా సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తోంది. విభ‌జ‌నానంత‌రం ఆంధ్ర ప్ర‌దేశ్ లో  ఫిల్మ్  - టెలివిజ‌న్ ఇన్ స్టిట్యూట్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావించింది. అమ‌రావ‌తి - విశాఖ ప‌ట్నం ల‌లో వాటిని ఏర్పాటు చేసి ప్ర‌తిభావంతులైన యువ‌త‌కు న‌ట‌న‌లో శిక్ష‌ణ‌ను ఇప్పించాల‌నుకుంది. అమ‌రావ‌తిలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకు జులైలో 14 మంది స‌భ్యుల‌తో ఓ క‌మిటీని కూడా ప్ర‌భుత్వం నియ‌మించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సుభాష్ ఘ‌య్ ప్ర‌తిపాద‌న‌కు సీఎం సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో కూడా సుభాష్ ఘ‌య్ హైద‌రాబాద్ లో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని ఐటీ మంత్రి కేటీఆర్ ను సంప్ర‌దించారు. దానికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్‌...రాచ‌కొండ‌లో ఆ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేసుకోమ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. స్థానిక యువ‌త‌కు న‌ట‌న‌లో శిక్ష‌ణ ఇప్పించాల‌నే ఉద్దేశంతో కేటీఆర్ ఈ ప్ర‌తిపాద‌న‌కు సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ముంబైలో సుభాష్ ఘ‌య్ విజ్ లింగ్ వుడ్స్ పేరుతో ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ను ప‌దేళ్లుగా నిర్వహిస్తున్నారు. అదే త‌ర‌హాలో ప్ర‌పంచ స్థాయి ఇన్ స్టిట్యూట్ ను హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసేందుకు కేటీఆర్ ను సుభాష్ ఘ‌య్ క‌లిశారు.
Tags:    
  • Subhash Ghai 
  • Chandrababu Naidu 
  • Amaravati 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS