• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టాంపరింగ్ దెబ్బ.....

టాంపరింగ్ దెబ్బ.. ఇద్దరికి వంద కోట్ల నష్టం

By - Tupaki Desk
Update: 2018-03-29 11:06 GMT
ఒక్క క్షణంలో జీవితాలు మారిపోతుంటాయి. ఒక్క నిర్ణయంతో పరిస్థితి తల్లకిందులు అవుతుంటుంది. అనాలోచితంగా చేసే ఒక తప్పిదం ఎలాంటి పరిణామాలకైనా దారి తీస్తుంది. ఇందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ల బాల్ టాంపరింగ్ ఉదంతమే నిదర్శనం. ఈ వివాదం ఆస్ట్రేలియా క్రికెటర్లకు.. ఆ దేశ క్రికెట్ వ్యవస్థకు మామూలు దెబ్బ కాదు దీని వల్ల వార్నర్ - స్మిత్‌ ల కెరీర్లే తల్లకిందులైపోయే పరిస్థితి వచ్చింది. నిన్నటిదాకా గొప్ప ఆటగాళ్లుగా ప్రపంచం చేత కీర్తించబడ్డ వీళ్లిద్దరూ ఇప్పుడు మోసగాళ్లుగా ముద్ర వేసుకున్నారు. దీని వల్ల వీళ్లకు జరిగిన నష్టం ఇంత అని కొలిచి చెప్పలేం. ఆర్థికంగా వీళ్లిద్దరికీ కలిపి రూ.100 కోట్ల దాకా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా.

క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ - స్మిత్‌ లపై ఏడాది పాటు నిషేధించిన సంగతి తెలిసిందే. దీని వల్ల బోర్డు కాంట్రాక్టు ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. దీంతో పాటు మ్యాచ్‌ లు ఆడటం ద్వారా వచ్చే కోట్ల రూపాయలూ పోతాయి. ఈ రూపంలోనే వీళ్లు తలో రూ.15-20 కోట్ల దాకా నష్టపోయే అవకాశముంది.  ఇక వారి వ్యక్తిగత స్పాన్సర్లు ఆటోమేటిగ్గా దూరమవుతారు. దీని ద్వారా కూడా భారీగా ఆదాయం పోతుంది. ఇక ఐపీఎల్ సీజన్‌ కు కూడా దూరమవుతున్నారు కాబట్టి చెరో రూ.12.5 కోట్ల ఆదాయం పోగొట్టుకుంటారు. ఇలా టాంపరింగ్ ఉదంతం పుణ్యమా అని తలో రూ.50 కోట్లయినా నష్టపోతారనడంలో సందేహం లేదు. ఇక దీని వల్ల వచ్చిన చెడ్డ పేరు వారికి అతి పెద్ద ప్రతికూలత. ఇన్నాళ్లూ ఎంతో గౌరవంగా సాగిన జీవితం ఇక దుర్భరంగా మారుతుంది. వాళ్లను ప్రతిచోటా అదోలా చూస్తారు. ఎవ్వరూ ఏ కార్యక్రమానికీ పిలవరు. ఏడాది పాటు ఇంటిపట్టునే ఉండాల్సి ఉంటుంది. నిన్నటిదాకా గౌరవించిన ప్రపంచం ఒక్కసారిగా మోసగాడిగా చూస్తే ఎలాంటి మానసిక స్థితి ఉంటుందో మాటల్లో చెప్పలేం. దీన్ని తట్టుకుని నిలబడటం మామూలు విషయం కాదు. దీని వల్ల వాళ్ల కెరీర్లే ప్రమాదంలో పడ్డా ఆశ్చర్యం లేదు.

 
Tags:    
  • Steve Smith 
  • David Warner 
  • Financial losses 
  • Ball tamparing 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS