• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  14 సెకన్ల లాజిక్.....

14 సెకన్ల లాజిక్.. అమ్మాయిని చూస్తే కేసే!

By - Tupaki Desk
Update: 2016-08-16 06:29 GMT
అమ్మాయిలపై రోజురోజుకీ లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ప్రతీరోజూ దేశంలో ఏదో ఒకచోట - ఎవరో ఒకరు లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారు. ఇక ఈవి టీజింగుల సంగతి చెప్పేదేమింది అనే విషయాలు తెలిసినవే. అయితే ఈ విషయాలపై తాజాగా ఒక పోలీస్ అఫీసర్ డిఫరెంట్ గా స్పందించారు. ఈ స్పందనపై కొంతమంది సూపర్ సూపర్ అని మెచ్చుకుంటుంటే.. మరి కొందరు మత్రం సెటైర్లు వేస్తున్నారు. ఇంతకూ ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పిన లాజిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం...

అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేరళలోని ఓ ఎక్సైజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ ఒక సూచన చేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కొచ్చిలో ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. ఎవరైనా ఒక అబ్బాయి పద్నాలుగు సెకన్లపాటు తదేకంగా ఒక అమాయి కళ్లలోకి చూస్తే వెంటనే ఎఫ్ ఐఆర్ నమోదు చేయవచ్చని అన్నారు. అలాగే.. బహుశా ఈ విషయం ఎవరికీ తెలియదేమో అని కూడా వ్యాఖ్యానించారు. కాకపోతే.. ఇలాంటి కేసు ఇప్పటివరకూ ఒక్కటికూడా నమోదుకాలేదని - అలా జరిగి ఉంటే మాత్రం అమ్మాయిలపై వేధింపులు తగ్గుముఖం పట్టేవని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళలో మహిళలు - యువతులపై జరుగుతున్న ఆకృత్యాలను తన ప్రసంగంలో ప్రస్థావించిన రిషిరాజ్ సింగ్.. ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడినా, వెనుకాలే ఫాలో అవుతూ విసిగించినా.. వెంటనే స్పందించి - వారికి అక్కడే బుద్ధి చెప్పాలని అన్నారు.

ఈ సమయంలో రిషిరాజ్ సింగ్ చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి కానీ.. ఈ 14 సెకన్ల లాజిక్ ఏమిటో అర్ధంకావడంలేదని చాలామంది వ్యాఖ్యానించారు. ఈ విషయాలపై స్పందించిన కేరళ రాష్ట్ర క్రీడల మంత్రి ఈపీ జయరాజన్.. రిషిరాజ్ సింగ్ ముందుగా న్యాయ చట్టాలన్నింటిని తెలుసుకుంటే మంచిదని.. ఈ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పాని అన్నారు. కాసేపు ఆయన చెప్పిందే వాస్తవమైతే.. సన్ గ్లాసెస్ పెట్టుకుని చూసేవాళ్లను ఎలా గుర్తించాలని, వారు తమవైపే చూస్తున్నారన్న విషయం ఎలా తెలుసుకోవాలని అని ప్రశ్నించారు. ఈ విషయంపై పోలీస్ ఆఫీసర్ చెప్పింది బాగానే ఉంది కానీ 14సెకన్ల లాజిక్కే అతిగా ఉందని కొందరంటుంటే... ఇకపై అమ్మాయిలు సెన్సార్స్ పెట్టుకుని అలా చూసినవారిని గుర్తించి మ్రోగేలా అలారాలు అమర్చుకోవాలని కామెంట్స్ విసురుతున్నారు.
Tags:    
  • woman 
  • 14 seconds 
  • Jail 
  • Rishi Raj Singh 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS