• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిప్యూటీ సీఎం అనుకుంటే -...

డిప్యూటీ సీఎం అనుకుంటే - మంత్రి పదవి దక్కింది!

By - Tupaki Desk
Update: 2019-08-20 07:29 GMT
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీరాములు పేరు ప్రముఖంగా వినిపించింది. అంతకు ముందు కూడా ఆయన కర్ణాటక రాజకీయంలో ప్రముఖుడు, గాలి జనార్ధన్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా గుర్తింపును కలిగి ఉన్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనను సీఎం అభ్యర్థి అన్నట్టుగా కూడా ట్రీట్ చేశారు. ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా  తిప్పారు.

హెలీకాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా పర్యటింపజేశారు. తెలుగు మూలాలు ఉన్న వాల్మికి కులస్తుడు శ్రీరాములు. బళ్లారి ప్రాంతానికి చెందిన వ్యక్తి. పార్టీ పై అసంతృప్తితో ఒకసారి తిరుగుబాటు కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీఎం అభ్యర్థి అనే ప్రచారం పొందారు.

అయితే అప్పుడు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఏదో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు కానీ, రెండు రోజులకే అది కూలిపోయింది. యడియూరప్ప అప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో శ్రీరాములు ఊసే లేకుండా పోయిందప్పుడు.

అదలా ఉంటే ఇప్పుడు కర్ణాటకలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. యడియూరప్ప కేబినెట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీమ్ లో శ్రీరాములుకు చోటు దక్కింది. అయితే ఒక దశలో శ్రీరాములుకు డిప్యూటీ సీఎం అనే ప్రచారమూ జరిగింది. ఆ ఆఫర్ ను కాంగ్రెస్ వాళ్లు కూడా ఇచ్చారంటారు. బీజేపీకి తిరుగుబాటు చేసి వస్తే డిప్యూటీ  సీఎంగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు ఆఫరిచ్చారంటారు. అయితే వాటికి శ్రీరాములు ఆకర్షితుడు కాలేదు.

ఇప్పుడు యడియూరప్ప కేబినెట్లో అయితే శ్రీరాములుకు చోటు దక్కింది. రెడ్డి బ్రదర్స్ కు సన్నిహితుడు అయిన ఈయనకు అలా అవకాశం లభించింది.
Tags:    
  • Sree Ramulu 
  • Ministry 
  • Yeddyurappa Cabinet 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS