అలా అయితే కోడెల సూసైడ్ నోట్ రాసేవారు కదా?

Update: 2019-09-17 04:43 GMT
కోడెల అనుమానాస్పద స్థితిలో మరణించినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. కోడెల ఇంట్లో - ఆయన ఆత్మహత్య చేసుకున్న రూమ్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు ప్రకటించారు. కోడెల కుటుంబీకులు కూడా ఆయన ఎలాంటి లేఖా రాయలేదని పేర్కొన్నారు.

దీంతో కోడెల ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆయన మరణాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న వైనాన్ని ప్రస్తావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ కోడెల ప్రభుత్వ వేధింపులతో ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆ విషయాన్ని కచ్చితంగా ప్రస్తావించే వారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం తనను వేధిస్తోందని - వాటిని తాళలేక చనిపోతున్నట్టుగా అయితే.. కోడెల ఆ విషయాన్ని కచ్చితంగా ప్రస్తావించేవారంటున్నారు. అయితే కోడెల ఎలాంటి లేఖనూ రాయలేదని ధ్రువీకరణ అవుతోంది. ఆయన వ్యక్తిగత కారణాలు - అందుకు సంబంధించిన ఇబ్బందులతో తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుని ఉండవచ్చు. అందుకే ఎలాంటి లేఖనూ రాయలేదని పరిశీలకులు అంటున్నారు. అయినా తెలుగుదేశం నేతలు - చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం ఆయన మరణాన్ని ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News