• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  12 బృందాలు వెతుకుతున్నా...

12 బృందాలు వెతుకుతున్నా దొరకని చింతమనేని

By - Tupaki Desk
Update: 2019-09-05 08:28 GMT
వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. దూకుడుగా వ్యవహరించటం.. అధికారం చేతిలో అంటే.. మహిళా అధికారులని కూడా చూడకుండా వారిపై భౌతికదాడులు చేయటం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కే చెల్లుతుంది. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినా ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో టీడీపీ అధినేత లైట్ తీసుకోవటం తెలిసిందే.

చింతమనేని తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా బాబు పట్టనట్లుగా వ్యవహరించటంతో ఆయన మరింతగా చెలరేగిపోయారన్న విమర్శ ఉంది. తన నియోజకవర్గ పరిధిలో తాను చెప్పిందే చట్టమన్నట్లుగా వ్యవహరించారన్న ఆరోపణ ఉంది.ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో ఓడిన అనంతరం కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనపై జోసెఫ్ అనే యువకుడు ధైర్యంగా ముందుకొచ్చి చింతమనేనిపై కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతో.. అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్న చింతమనేని ఎవరికి కనిపించకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు.

ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు 12 బృందాలతో కూడిన పోలీసులు వెతుకుతున్నా.. ఆయన ఆచూకీ మాత్రం లభించటం లేదు. వివాదాస్ప రీతిలో వ్యవహరించటమే కాదు.. భారీ ఎత్తున పోలీసులు వెతుకుతున్నా.. దొరక్కుండా ఉండటంలోనూ తనకున్న ప్రతిభను చింతమనేని ప్రదర్శిస్తున్నారని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. అరెస్ట్ ముప్పు ఎదుర్కొంటున్న చింతమనేని.. పోలీసులకు చిక్కుండా నేరుగా.. కోర్టులో లొంగిపోతారన్న ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు కారణమైన జోసెఫ్ పై ఒత్తిళ్లు  ఎక్కువ అవుతున్నట్లుగా చెబుతున్నారు. చింతమనేనిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని.. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న వార్నింగ్ లు ఇస్తున్నట్లుగా జోసెఫ్ చెబుతున్నారు.పోలీసులకు దొరక్కుండా.. తనపై కేసు పెట్టిన జోసెఫ్ ను బెదిరిస్తున్న చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నట్లుగాతెలుస్తోంది. మరి.. చింతమనేని దొరుకుతారా? అన్నదిప్పుడున్న ప్రశ్న.
    

Tags:    
  • Special Police Teams 
  • Chintamaneni Prabhakar 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS