• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బురఖా వేసుకోను.....

బురఖా వేసుకోను.. క్రీడాకారిణి సంచలనం..

By - Tupaki Desk
Update: 2018-06-13 06:32 GMT
ప్రపంచంలోనే అత్యంత కఠిన నిబంధనలు గల్ఫ్ దేశాల్లో ఉంటాయంటారు. ఆ నిబంధనల వల్లే అక్కడ జీవించడం చాలా కష్టమని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.. తాజాగా గల్ఫ్ దేశాల్లో ప్రముఖమైన ఇరాన్ లో  అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి భారత్ నుంచి బృందం కూడా వెళుతోంది. అందులో మేటి చెస్ క్రీడాకారిణి సౌమ్య స్వామినాథన్ ఇరాన్ పెట్టిన నిబంధనలు తోసిరాజని ఏకంగా టోర్నీ నుంచే వైదొలగడం హాట్ టాపిక్ గా మారింది.

ఇరాన్ లో మహిళలు బురఖా ధరించి బహిరంగ కార్యక్రమాల్లో - క్రీడల్లో పాల్గొనాలనే నిబంధనలున్నాయి. వీటిని తప్పనిసరిగా పాటించాలి. ఇరాన్ కు వచ్చిన విదేశీయులు సైతం తల వరకూ బుర్ఖాలాంటి వస్త్రాలు ధరించాలనే నిబంధన ఉంది. అక్కడ ఆడాలంటే తప్పనిసరిగా ఆ దేశ పద్ధతులు పాటించాలనే నిబంధన పెట్టడంతో సౌమ్య వైదొలిగింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది.

‘జూలై 26 నుంచి ఆగస్టు 4వరకూ జరగాల్సిన ఆసియన్ నేషన్స్ కప్ చెస్ చాంపియన్ షిప్ 2018లో జాతీయ జట్టు తరఫున అర్హత సాధించాను. కానీ ఇందులో ఆడాలంటే ఖచ్చితంగా తలవరకూ ముసుగుకానీ, లేదా బుర్ఖా కానీ ధరించాల్సిందేనని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. భారతదేశ పౌరురాలిగా .. వ్యక్తిగతంగా నా హక్కులకు భంగం కలిగేలా ఉన్న ఇరాన్ సంప్రదాయం పాటించాల్సిందేనన్న నిబంధనను ఒప్పుకోలేకపోయాను.. ఈ నేపథ్యంలో నాకు కనిపించిన ఒకే ఒక్క దారి పోటీనుంచి వైదొలడం ’ అంటూ సౌమ్య టోర్నీ నుంచి నిష్క్రమించి సంచలనం సృష్టించింది.

ఇలాంటి అంతర్జాతీయ టోర్నీలో నిబంధనలు పెట్టడం సరికాదని..కావాలంటే ఓ యూనిఫాం పెడితే అందరూ అవే వేసుకుంటారని సౌమ్య అభిప్రాయపడింది. ఇలా మత సంబంధిత నియమాలు పాటించి క్రీడాకారులకు ఆటంకం కలిగించడం సమంజసం కాదని స్పష్టం చేసింది.. అందరిలా సర్దుకుపోయి ఈవెంట్లలో తాను పాల్గొనలేనని సౌమ్య ప్రకటించి ఇరాన్ కు షాక్ ఇచ్చింది. 
Tags:    
  • Soumya Swaminathan 
  • Asian Team Chess 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS