రాజ్యసభలో ఏచూరి ‘ప్రత్యేక’ మాట

Update: 2016-07-26 14:15 GMT
తెలుగు వాడైనప్పటికీ ఏపీకి జరిగిన అన్యాయం గురించి పెద్దగా స్పందించనిజాతీయ నేతల్లో సీపీఎం అగ్రనేతల్లో ఒకరైన సీతారాం ఏచూరి తాజాగా రాజ్యసభలో గళం విప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించిన ఏచూరి.. రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ కురియన్ తో కొద్దిపాటి సంవాదానికి దిగారు. ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ నేతలు రాజ్యసభలో నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్న వేళ రియాక్ట్ అయిన కురియన్.. నిబంధనల ప్రకారం రాజ్యసభను అడ్డుకోవటం సరికాదన్నారు. ఈసందర్భంగా ఏచూరికి.. కురియన్ కు మధ్య కాసేపు వాదన నడిచింది.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చ.. ఓటింగ్ పెట్టాలన్న ఏచూరి.. దీనికి మించి ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. గతంలో ప్రధాని స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటిస్తే ఈ అంశం సమిసిపోతుందన్నారు. రూల్స్ ప్రకారం సభ జరిగి ఉంటే.. ప్రత్యేక హోదా అంశంపైచర్చ జరిగేదన్న ఆయన.. నిబంధనల ప్రకారం కేవీపీ బిల్లుపై చర్చ జరగనందుకే కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేస్తున్నట్లుగా వ్యాఖ్యనించారు. ఏమైనా.. ఏచూరి సైతం ఏపీకి  ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
Tags:    

Similar News