అమిత్ షా దేశభక్తిపై ఆప్ నిప్పులు!

Update: 2016-10-08 04:28 GMT
అతడికి దేశభక్తి గురించి మాట్లాడే హక్కే లేదు.. జాతీయ వాదం విషయంలో కేజ్రీవాల్ పక్కన నిలబడే సామర్ధ్యం కూడా ఆయనకు లేదు.. రాజకీయ విలువలకే ఆయన కళకం వంటి వాడు.. ఆయనకున్న నేర చరిత్ర దేశం మొత్తానికి తెలిసిందే.. సోహ్రాబుద్దీన్ షేక్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో అతడు నిందితుడు.. ఈ మాటలన్నీ ఎవరి గురించంటారా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురించి. అవును... అమిత్ షా పై ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థాయిలో విరుచుకు పడింది.

భారత ఆర్మీ నిర్వహించిన మెరుపు దాడుల విషయంలో రాజకీయం చేయడం సరికాదన్న అమిత్ షా పై ఆప్ తీవ్ర విమర్శలు గుప్పించింది. రాజకీయ విలువలకే కళంకం వంటి వాడైన అమిత్ షాకున్న నేర చరిత్ర గురించి దేశం మొత్తానికి తెలిసిందేనంటూ మొదలుపెట్టిన ఢిల్లీ డిప్యూటీ సీఎం - ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా... కేజ్రీవాల్ పేరును పలికే అర్హత కూడా అమిత్ షాకు లేదని, హత్యారోపణలు సైతం ఉన్న వ్యక్తి దేశభక్తి గురించి సర్టిఫికెట్లు జారీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. సోహ్రాబుద్దీన్ షేక్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో నిందితుడని, ప్రత్యేక సీబీఐ కోర్టు ద్వారా విముక్తుడైన వ్యక్తి... కేజ్రీవాల్ దేశభక్తి గురించి ఎలా మాట్లాడతారతని సిసోడియా ఫైరయ్యారు!

జాతీయవాదం విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పక్కన నిలబడే సామర్థ్యం కూడా బీజేపీ ప్రెసిడెంట్ కు లేదని 'ఆప్' అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ దేశ భక్తి సెంటిమెంట్ గురించి దేశం మొత్తానికి తెలుసునని, షా గురివింద గింజ నీతిని పాటిస్తున్నారని, ఆ విషయానికి వస్తే సర్జికల్ స్ట్రైక్స్ సందేహాలు వ్యక్తం చేసిన వ్యక్తుల్లో షా మొదటివాడుగా పాకిస్థాన్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోందని సిసోడియా తెలిపారు. ఈ రేంజ్ లో అమిత్ షా పై ఆప్ ఫైరయ్యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News