• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  షాకిచ్చిన కేంద్రం:...

షాకిచ్చిన కేంద్రం: కరోనాతో కలిసి బతకాల్సిందేనట.!

By - Tupaki Desk
Update: 2020-05-09 09:30 GMT
కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తుండడం.. కట్టడికి విధించిన లాక్ డౌన్ పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోవడంతో కేంద్ర ప్రభుత్వంలో నిరాశ నిసృహ వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో  కరోనా కేసుల సంఖ్య 59,662కి చేరిందని.. కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు 1985మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఈ సందర్భంగా లవ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే కరోనా వైరస్ నియంత్రణ చర్యలను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని.. మన ముందు పెద్ద సవాల్ ఉందని.. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోక తప్పదని’’ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని లవ్ అగర్వాల్ తెలిపారు. 42 జిల్లాల్లో గత 28 రోజులుగా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని పేర్కొన్నారు. మరో 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు బయటపడలేదన్నారు.

లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళుతున్నారని.. కరోనా విజృంభించే అవకాశాలున్నాయని.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని లవ్ అగర్వాల్ తెలిపారు. వలస కూలీల కోసం 222 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపారు. 2.5 లక్షల మంది సొంత ప్రాంతాలకు వెళ్లారని వివరించారు.

ఇది వరకు ఏపీ సీఎం జగన్ కూడా ఇదే మాట అని లాక్ డౌన్ సడలించాలని.. కరోనాతో కలిసి బతకాల్సిందేనని.. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అప్పుడు జగన్ ను విమర్శించిన వాళ్లకు ఇప్పుడు కేంద్రం ప్రకటన చెంపపెట్టులా మారింది.
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Corona Virus In Andhra Pradesh 
  • Corona Virus 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

Copyright @2026

Powered by Blink CMS