స్నానం చేస్తుంటే వీడియో తీసి.... తన ప్రియుడికి పంపిన నర్సు !

Update: 2020-12-14 10:30 GMT
అసలు మహిళలకి మహిళల నుండే ముప్పు పొంచి ఉంటుంది అనడానికి సరైన ఉదాహరణ ఈ ఘటన. తన సహా ఉద్యోగి బాత్రూంలో స్నానం చేస్తుంటే వీడియో తీసి, తన ప్రియుడికి పంపించిందో ప్రియురాలు.  ఈ దారుణమైన ఈ ఘటన బెంగుళూరులోని ఓ నర్సింగ్ హాస్టల్ లో జరిగింది. సాటి మహిళ, సహోద్యోగి అని కూడా చూడకుండా స్నానం చేస్తుండగా వీడియో తీసి, ప్రియుడికి పంపిన  నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ... బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి హాస్టల్ లో సహ ఉద్యోగిని బాత్‌ రూమ్ ‌లో స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి ప్రియుడికి పంపింది‌ చేసింది ఓ నర్సు. హాస్టల్‌ ఇన్‌ చార్జ్‌ ఫిర్యాదు మేరకు ఆదివారం వైట్‌ ఫీల్డ్‌ పోలీసులు నర్సు అశ్వినినీ అరెస్ట్‌ చేశారు.

ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. వైట్ ‌ఫీల్డ్‌ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అశ్విని నర్సుగా పనిచేస్తోంది. అత్యవసర సేవల విభాగంలోని నర్సులకు హాస్టల్‌ వసతి కల్పించారు. ఈనెల 5న సాయంత్రం ఓ నర్సు తన గదిలో స్నానం చేస్తుండగా బాత్ ‌రూమ్‌ లో మొబైల్‌ కనిపించడంతో భయపడిన సదరు నర్సు దాన్ని పరిశీలించగా వీడియో రికార్డు అయినట్లు గుర్తించి హాస్టల్‌ ఇన్‌ చార్జ్ ‌కు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ అశ్వినిది కావడంతో ఆమెను విచారించడంతో అసలు విషయం బయటపడింది.
Tags:    

Similar News