హైదరాబాద్ లో కాంగ్రెస్.. బీజేపీ వర్గాలు కొట్టేసుకున్నాయా?
రెండు జాతీయ పార్టీల ప్రధాన కార్యాలయాలు ఒకే ప్రాంతంలో కూతవేటు దూరంలో ఉన్న వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు హైదరాబాద్ మహానగరంలో ఇప్పటివరకు చూడని సిత్రమైన పరిస్థితుల్ని చూడాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. యూపీలో చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేలా చేయటమే కాదు.. రెండు పార్టీల మధ్య గొడవ వీధి పోరాటాన్ని తలపించేలా చేసింది. కాంగ్రెస్.. బీజేపీ నేతల మధ్య బాహాబాహీలు నాంపల్లి ప్రధాన రహదారిని రణరంగంగా మార్చేసింది.
యూపీలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ ను పోలీసులు నెట్టేయటం.. అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనను చేపట్టారు. బీజేపీ సర్కారు చర్యను తప్పు పడుతూ.. గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ యూత్ నాయకులు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ వర్గాలు ప్రయత్నించాయి. దీంతో.. రెండు వర్గాల మధ్య వాదనలు.. పోటాపోటీ నినాదాలే కాదు.. బాహాబాహీ చోటు చేసుకుంది. ఇరువర్గాల వారు ఒకరిని ఒకరు నెట్టేసుకున్నారు.
ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళ పరిస్థితి చాలాసేపు నెలకొంది. ఇలాంటి వాతావరణం ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. యూపీలో తమ భావి అధినేతను పోలీసులు నెట్టేయటంపై తీవ్ర ఆగ్రహాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తే.. తమ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించటానికి వస్తారా? అన్న ఆగ్రహాన్ని బీజేపీ వర్గాలు ప్రశ్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో యూత్ నేత అనిల్ కుమార్ యాదవ్ చొక్కా చినిగిపోయింది. దీంతో గొడవ మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్యంగా గాంధీ భవన్ నుంచి చేపట్టిన ర్యాలీ మరింత ఉద్రిక్త పరిస్థితులకు తెర తీసింది. బీజేపీ హెడ్డాఫీసు దిశగా రేవంత్ పరుగులు తీస్తుంటే.. ఆయన్ను అడ్డుకోవటానికి పోలీసులు నానా పాట్లు పడాల్సి వచ్చింది. రెండు జాతీయపార్టీ నేతలు.. కార్యకర్తలు.. క్యాడర్ బాహాబాహీకి దిగటంతో రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇదంతా రాహుల్ కు ఎదురైన అవమానంతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ టూ కోసం పోటీ నెలకొన్న వేళ.. తమ అధిక్యతను ప్రదర్శించే ప్రయత్నాన్ని రెండు పార్టీలు చేశాయని చెప్పక తప్పదు.