• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జైలు నుంచి బయటకు వచ్చిన...

జైలు నుంచి బయటకు వచ్చిన శిల్పా చౌదరీ..!

By - Tupaki Desk
Update: 2021-12-24 13:41 GMT
శిల్పా చౌదరీ... గత కొద్ది రోజులుగా మీడియాలో చాలా బాగా వినిపిస్తున్న పేరు. డబ్బున్న వారు, గొప్ప హోదాల్లో ఉన్న వారు, సమాజంలో పేరు, పలుకుబడి ఉన్న వారు, సినిమా నటులు, వారి బంధువులు, కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని వారితో పరిచయాలు పెంచుకొని వారి నుంచి కోట్లది రూపాయిలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తి శిల్పా చౌదరి. మహిలు సరదాగా చేసుకునే కిట్టీ పార్టీలకు డబ్బున్న వారిని పిలిచి వారి అధిక మొత్తంలో వడ్డీని ఆశ చూపించింది శిల్పా. ఈమె మాటలు నమ్మి డబ్బులు ఇచ్చిన వారికి పెద్ద కుచ్చు టోపీ పెట్టింది. వారి నుంచి కోట్ల రూపాయిలు వసూలు చేసింది. హైదరాబాద్​ లో రియల్​ ఎస్టేట్​ బాగుంటుందని నమ్మించి వారిని మోసం చేసింది. ఈ కేసుల్లోనే జైలుకు పోయిన శిల్పా చౌదరీ కొద్ది రోజులు జైలు జీవితం తరువాత తిరిగి బయటకు వచ్చింది.

శిల్పా చౌదరీ బయటకు వచ్చేందుకు  హైదరాబాద్ రాజేంద్ర నగర్​ లోని కోర్టు బెయిల్  ఇచ్చింది. బెయిల్​ మంజూరు చేయడానికి కొన్ని షరతులను పాటించాలని న్యాయస్థానం సూచించింది. మొత్తంగా ఆమెపై ఉండే మూడు కేసులకు సంబంధించి బెయిల్​ ను మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆమె బెయిల్​ ఉత్తర్వులు చంచల్​ గూడ జైలుకు చేరుకున్నాయి. వాటిని పరిశీలించిన జైలు అధికారులు అమెను శుక్రవారం విడుదల చేశారు.

శిల్పా చౌదరికి బెయిల్​ ఇచ్చిన  కోర్టు కొన్ని షరతులను కూడా విధించింది. జైలు నుంచి విడుదల అయిన తరువాత దేశం విడిచి ఎక్కడకీ పోకూడదని చెప్పింది. దీనితో పాటు రూ.10 వేలు ను పూచీకత్తుగా కట్టాలని ఆదేశించింది. అంతేగాకుండా బయటకు వెళ్లిన తరువాత కేసుకు సంబంధించిన అంశాలపై ఇతరులతో చర్చించకూడదని పేర్కొంది. ఫోన్​ లో కానీ, డైరెక్ట్ గా కానీ ఈ విషయాలను మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేస్తూ.. బెయిల్ మంజూరు చేసింది.  దీనితో పాటు నార్సింగ్​ లోని పోలీస్ స్టేషన్ లో ప్రతీ శనివారం విధిగా హాజరు కావాలి చెప్పింది. వీటిలో ఏదైనా అతిక్రమించన ఎడల బెయిల్​ రద్దు అవుతుందని స్పష్టం చేసింది.

గత నెల 13న శిల్పా చౌదరిపై తొలి కేసు నమోదు అయ్యింది. దివ్యా రెడ్డి అనే మహిళ తొలుత నార్సింగి  పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు 25న శిల్పా చౌదరిని అదుపులోకి తీసుకున్నారు.  ఆమెతో పాటు భర్తను కూడా అరెస్ట్​ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో పోలీసులు ఇరువురిని రిమాండ్​ కు పంపారు. ఇప్పటి వరకు మూడు సార్లు కస్టడికి తీసుకుని విచారించారు. దీంతో కొంత మేర నోరు విప్పిన ఆమె బాధితుల దగ్గర నుంచి తీసుకున్న సొమ్మును తిరికి ఇచ్చేస్తానని పేర్కొంది. ఇప్పటి వరకు తన ఆస్తి వివరాలను కొంత మేరకు మాత్రమే వివరించినట్లు పోలీసులు తెలిపారు. తన పేరు మీద ఉండే విల్లా, హయత్ నగర్​ లో ఉండే ఫ్లాట్​, ఇతర ఆస్తులను కూడా అమ్మి కడతాని పేర్కొంది.
Tags:    
  • Shilpa Chowdary 
  • Cheating Case 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS