దొంగ ఓట్లు పట్టించిన ఆమె సీబీఐలో చేరాలి: మహేష్ కత్తి

Update: 2021-04-18 10:30 GMT
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా దొంగ ఓట్లు, నకిలీ ఓటర్ల కలకలం చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ-జనసేన నేతలు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. దీనిపై ఈసీ ఇప్పుడు విచారణ జరుపుతోంది.

ఈ దొంగ ఓట్లను, దొంగ ఓటర్లను పట్టుకోవడంలో బీజేపీకి శాంతిరెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి రత్నప్రభ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కీలకంగా వ్యవహరించారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వీడియోలు చూసిన చిత్తూరు జిల్లాకు చెందిన దళిత నాయకుడు, క్రిటిక్ కత్తి మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాసన చూసి దొంగ ఓటు పట్టుకోవడం.. కంటి చూపుతో కరోనా మాస్క్ వేసుకున్నప్పటికీ దొంగ ఓటర్లను ఎలాం గుర్తించడం సాధ్యమైందంటూ కత్తి మహేష్ ప్రశ్నించారు. దొంగ ఓట్లను పట్టించిన బీజేపీ నాయకురాలు సీబీఐలో చేరాలంటూ దెప్పి పొడిచారు.

ఇదంతా పక్కా ప్లాన్ తో చేసినట్టు అర్థం అవుతోందని కత్తి మహేష్ ఆరోపించారు. టీడీపీ, బీజేపీ నేతలు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం దొంగఓటర్ల వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు.  దొంగ ఓటర్లతో ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం అధికార వైసీపీ లేదని కత్తి మహేష్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News