• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాష్ట్రపతిభవన్ లో ఆమె......

రాష్ట్రపతిభవన్ లో ఆమె... ?

By - Tupaki Desk
Update: 2022-01-27 23:30 GMT
ఉత్తరాది రాష్ట్రాలో ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఫలితాలు రావడానికి నలభై రోజుల టైమ్ ఉంది. ఆ తరువాత జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులు మారుతాయి.  బలాబలాలు కూడా తేలతాయి. మార్చి 10న అయిదు రాష్ట్రాల ఫలితాలు వచ్చాక బీజేపీ బలం ఎప్పటిలాగానే ఉంటే రాష్ట్రపతి ఎన్నికలలో పెద్దగా హడావుడి ఉండదు, విపక్షాలు వ్యతిరేకించినా బీజేపీ మద్దతు ఇచ్చిన వారే రాష్ట్రపతి భవన్ లోకి వెళ్తారు. అక్కడ ఏమైనా తేడా కొడితే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఇదంతా ఈ ఎన్నికల ఫలితాల మీదనే ఆధారపడి ఉంటుంది.

వంద దాకా ఎంపీలు, ఆరు వందల దాకా ఎమ్మెల్యేలు ఈ అయిదు రాష్ట్రాలలో ఉన్నారు. వీరంతా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రోల్ కాలేజ్ మెంబర్స్ గా ఉంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింది పదవీ కాలం జూలైతో పూర్తి అవుతుంది. ఆయన వారసుడు ఎవరు అన్న చర్చ కూడా ఇపుడు జోరుగా సాగుతోంది. బీజేపీ ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తుంది అన్నదీ కూడా అసక్తికరమే.

ఎందుకంటే 2017లో చూసుకుంటే బీజేపీ అనూహ్యంగా రామ్ నాధ్ కోవింద్ ని తెరపైకి తీసుకువచ్చింది. ఇపుడు కూడా అలాంటి సన్నివేశమే చూడవచ్చు అంటున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఆమె బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. మోడీ అమిత్ షా, జేడీ నడ్డా తరువాత ఆమె బీజేపీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా ఎదిగారు. 2006లో బీజేపీలో చేరిన నిర్మలా సీతారామన్ అంచెలంచెలుగా ఎదిగి బీజేపీ అగ్ర నేతల మద్దతు సంపాదించుకున్నారు. ఆమె ఇందిరా గాంధీ తరువాత మహిళగా రక్షణ మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ఆ శాఖను సమర్ధంగా ఆమె చూశారు అన్న మాట కూడా ఉంది.

ఇంకో వైపు చూస్తే ఆర్ధిక మంత్రిగా నిర్మల గత మూడేళ్ళుగా ఉంటున్నారు. ఆమె విషయంలో మోడీ అమిత్ షా మంచి నమ్మకంగా ఉన్నారు. అందుకే ఆమెను రాష్ట్రపతి భవన్ లోకి పంపించాలని చూస్తున్నారు అని తెలుస్తోంది. 2007లో కాంగ్రెస్ జమానాలోతరఫున ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి అయ్యారు.  అంటే ఇప్పటికి పదిహేనేళ్ల క్రితం అన్న మాట. ఇపుడు బీజేపీ కూడా మహిళలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఉందని, వారి ట్రంప్ కార్డ్ నిర్మలా సీతారామన్ అవుతుంది అంటున్నారు.

Tags:    
  • Nirmalasitaraman 
  • rashtrapatibhavan 
  • ramnadhkovind 
  • presidenr 
  • latestnews 
  • tupakiupdates 

Similar News

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !

2026-11-19 04:57 GMT

Copyright @2026

Powered by Blink CMS