• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'మహా'ప్రభుత్వంలో అలజడి .....

'మహా'ప్రభుత్వంలో అలజడి .. కలిసి కొనసాగడం కష్టమేనా ?

By - Tupaki Desk
Update: 2020-02-15 09:45 GMT
శివసేన , కాంగ్రెస్ , ఎన్సీపీ ఈ మూడు పార్టీల సిద్దాంతాలు వేరు , ప్రతిపాదనలు వేరు. కానీ , గత అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన అనూహ్య పరిణామాల తరువాత అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ‘మహా వికాస్ ఆగాఢీ’ పేరుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరలేపారు. అయితే , సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా సీఎం గా శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయగా ..కాంగ్రెస్ , ఎన్సీపీ కి కీలకమైన మంత్రుత్వ శాఖలని కేటాయించారు. ఇప్పటివరకు ఈ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎటువంటి లుకలుకలు లేకుండానే కొనసాగింది.

కానీ , తాజాగా ఎల్గార్ పరిషత్ కేసు.. మహావికాస్ అగాడీ ప్రభుత్వాన్ని పెద్ద సమస్యలో పడేసింది. ఎల్గార్ పరిషత్‌ కు సంబంధించిన కేసును.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఎన్‌ ఐఏకి అప్పగించారు. దీనిపై శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది కూడా ఎదో సన్నిహితుల మధ్యన కాదు ..బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. శాంతి భద్రతలు రాష్ట్రపరిధిలోని అంశమని , కేంద్రం ఆ పరిధిలోకి చొచ్చుకురావడం దారుణమని అన్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సారథ్యంలో మహా వికాస్ అగాఢీ సేన గా ఏర్పడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్... ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే తొలిసారి గమనార్హం.

ఇకపోతే, గత కొన్ని రోజుల ముందు ఈ కేసును పుణె పోలీసుల నుంచి ఎన్ ఐ ఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం తో ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తులో కేంద్రానికి అన్ని అధికారాలు ఉన్నప్పటికీ, తమను సంప్రదించకుండా ఎన్ ఐ ఏకి ఎలా అప్పగిస్తారంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోఈ కేసుని సిట్‌ తోనే జరిపించాలంటూ శరద్ పవార్ డిమాండ్ చేశారు. కానీ , తాజాగా ఈ కేసుని సీఎం ఉద్ధవ్ ఎన్‌ ఐఏకి అప్పగించడం పై పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చూడాలి మరి ఈ అసంతృప్తి మహా సర్కార్ లో ఎలాంటి కుదుపులు తీసుకువస్తుందో ...
Tags:    
  • Maharashtra 
  • Maharashtra Politics 
  • Maharashtra News 
  • Telugu News 
  • Mumbai News 
  • Maharashtra Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS