అంబానీ సోదరులకు రూ.25కోట్లు ఫైన్ వేసిన సెబీ

Update: 2021-04-08 04:30 GMT
దేశంలో అత్యంత ప్రభావవంతమైన.. శక్తివంతమైన పారిశ్రామిక దిగ్గజాలుగా చెప్పే అంబానీ బ్రదర్స్ కు సెబీ షాకిచ్చింది. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఒక కేసులో ముకేశ్.. అనిల్ అంబానీలతో పాటు మరికొందరికి కలిపి సెబీ రూ.25కోట్ల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అంశమే దీనికి కారణమని చెబుతున్నారు. ఈ కేసులో అంబానీ బ్రదర్స్ మాత్రమే కాదు.. ముకేశ్ సతీమణి నీతా అంబానీ..అనిల్ సతీమణి టీనా అంబానీతో పాటు మరికొన్ని సంస్థలపైనా ఫైన్ వేశారు.

ఇంతకూ వారు చేసిన తప్పేంటి? అన్న విషయంలోకి వెళితే.. 2000లో ఐదు శాతానికి పైగా వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీ ప్రమోటర్లు..పీఏసీ.. వివరాలు అందించటంలో ఫెయిల్ అయినట్లుగా సెబీ స్పష్టం చేస్తోంది. నిబంధనల ప్రకారం ఈ లావాదేవీని పబ్లిక్ గా ప్రకటించాల్సి ఉంది.

కానీ.. అలాంటి ప్రకటన ఏదీ చేయకపోవటంతో.. టేకోవర్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా సెబీ స్పష్టం చేసింది. దీంతో రూ.5కోట్ల జరిమానాను విధించారు. ఈ మొత్తాన్ని కలిసి కానీ విడిగా కానీ చెల్లించొచ్చని సెబీ స్పష్టం చేసింది. అంబానీ బ్రదర్స్ ఇద్దరు 2005లో తమ తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని రెండు ముక్కలు చేసుకొని.. ఎవరికి వారు సొంత సారథ్యంలో తమ కంపెనీల్ని నడపటం తెలిసిందే. ఈ ఉదంతంలో అనిల్ ఫెయిల్ అయితే.. ముకేశ్ దూసుకెళ్లిన వైనం తెలిసిందే.
Tags:    

Similar News