కరోనా వచ్చిందని అపార్ట్ మెంట్ కు రేకులతో సీల్
బెంగళూరు మున్సిపల్ అధికారులు తమ కర్కషత్వాన్ని చాటారు. కరోనా సోకిన ఓ తల్లి, ఇద్దరు చిన్న పిల్లల పట్ల అమానుషంగా వ్యవహరించారు. కరోనా వ్యాపించకుండా ఆ తల్లీపిల్లలు ఉంటున్న ప్లాట్ ను రేకులతో సీల్ చేయడం దుమారం రేపింది. నిరంకుశంగా వ్యవహరించిన బెంగళూరు మున్సిపల్ అధికారుల తీరుపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
బెంగళూరులో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. భారీగా కేసులతో లాక్ డౌన్ కూడా పెట్టారు. తాజాగా బెంగళూరు సిటీలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న తల్లి, ఆమె ఇద్దరు చిన్న పిల్లలకు కరోనా వైరస్ పాజిటివ్ అని మున్సిపల్ అధికారులు గుర్తించారు. అదే అపార్ట్ మెంట్ లో అనేక ప్లాట్స్ పక్కపక్కనే కుటుంబాలు నివసిస్తున్నాయి.
దీంతో ఆ మహిళ, పిల్లల ద్వారా కరోనా వ్యాపించకుండా మున్సిపల్ అధికారులు ఆమె ఉంటున్న ఇంటిని సీల్ చేశారు. ఆ మహిళ ఇంటిని పక్కనే వృద్ధులకు కూడా కరోనా సోకడంతో వారి ఇంటిని కలిపి రేకుల షీట్లను బిగించి బయట నుంచి మేకులు కొట్టేశారు. వారు బయటకు రాకుండా.. వారి గాలి కూడా రాకుండా సీల్ చేసేశారు. అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. నెటిజన్లు అధికారుల చర్యపై మండిపడుతున్నారు. భారత దేశంలో ఇంత ఉన్మాదమా అని ఆడిపోసుకున్నారు.
పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బెంగళూరు మున్సిపల్ అధికారులు ఆ రేకుల షీట్లను రాత్రికి రాత్రి తొలగించారు.