మంత్రి అనిల్ కుమార్ కు సంపూర్ణేష్ బాబు కౌంటర్
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఆన్ లైన్ లో టికెట్లు అమ్మితే పవన్ కళ్యాణ్ కు ఏమవుతుంది? అని ప్రశ్నించారు.
టాలీవుడ్ లో తమకు అందరు హీరోలు సమానమేనని.. ‘సంపూర్ణేష్ బాబు అయినా.. పవన్ కళ్యాణ్ అయినా ఒకటేనని ’ మంత్రి అనిల్ కుమార్ చురకలంటించారు. అయితే మంత్రి అనిల్ కుమార్ తనను పవన్ కళ్యాన్ తో పోల్చడంపై హీరో సంపూర్ణేష్ బాబు స్పందించారు. మంత్రి అనిల్ కు కౌంటర్ ఇచ్చారు.
‘పవన్ కళ్యాణ్ గారితో తనను సమానంగా చూడడం చాలా సంతోషకరంగా ఉందని.. వెంటనే చిత్రపరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని’ సంపూర్ణేష్ బాబు కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఏపీ మంత్రి అనిల్.. సంపూకు మద్దతుగా మాట్లాడినా సరే.. సంపూ మాత్రం పవన్ కే సపోర్టు చేయడం విశేషం. ఏపీలో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని వేడుకున్నాడు. దీన్ని బట్టి సంపూ మద్దతు పవన్ కళ్యాణ్ కేనని అర్థమైంది. మంత్రి అనిల్ కు సంపూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడని జనసైనికులు ఈ ట్వీట్ ను వైరల్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.