• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రఘువీరాను ఏకాకిని...

రఘువీరాను ఏకాకిని చేయబోతున్న శైలజానాథ్

By - Tupaki Desk
Update: 2015-11-18 09:50 GMT
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత సాకే శైలజానాథ్ పార్టీ మారబోతున్నారని సమాచారం. మొన్నటి ఎన్నికల నాటికే కాంగ్రెస్ సీను ముగియడంతో ఆయన అప్పట్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నాలూ చేశారు. పనిలో పనిగా వైసీపీ టిక్కెట్ కోసం కూడా ఆయన ప్రయత్నించారు. అయితే... ఆ రెండు పార్టీల నుంచి కూడా టికెట్ రాకపోవడంతో భంగపడిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరపునే శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెసు కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తున్నారు. మొన్నటిమొన్న మట్టి సత్యాగ్రహం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే... ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే మళ్లీ లేచేలా లేదని గుర్తించిన ఆయన పార్టీ మారాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే... టీడీపీ ఆయన పట్ల ఆసక్తి చూపకపోవడంతో వైసీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

శింగనమలలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన యామినీ బాల చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. దీంతో ఆమె స్థానంలో శింగనమల నుంచి శైలజానాథ్ ను అభ్యర్థిగా ఇప్పటి నుంచే గట్టిచేయాలని జగన్ అనుకుంటున్నారని సమాచారం. పైగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శైలజానాథ్ కు పట్టుంది.  దీంతో మరికొద్దిరోజుల్లోనే శైలజానాథ్‌ వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే... రఘువీరారెడ్డి వెనుక తిరిగే ఒకరిద్దరు నాయకుల్లోమరొకరు తగ్గినట్లే. ఇప్పటికే రఘువీరా ఏపీలో ఒంటరి పోరాటం చేస్తున్నారు... సొంతజిల్లా నేత కాబట్టి అప్పుడప్పుడు శైలజానాథ్ మాత్రమే ఆయన వెంట కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా వైసీపీలో చేరితో రఘువీరా ఏకాకి అయినట్లే.
Tags:    
  • Sailajanath 
  • YSRCP 
  • Telugu News 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS