రోహిత్ ఫిట్ నెస్ స్టేటస్ తెలీదు.. ఫిట్ గా ఉంటే ఆసీస్ పంపండి.. సచిన్
రోహిత్ శర్మ గాయానికి సంబంధించిన వివాదాలు ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ముంగిట రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఆ తర్వాత కోలుకొని ఫైనల్లో కూడా ఆడాడు. అయితే ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయకపోవడంతో కోహ్లీ- రోహిత్ ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దానికి తోడు కోహ్లీ కూడా కెప్టెన్ అయ్యుండి రోహిత్ కి గాయం గురించి తనకు ఏ సమాచారం లేదని ప్రకటించడం విమర్శలకు దారితీసింది. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నది నిజమేనని నిర్ధారించింది. కోహ్లీ కారణంగానే రోహిత్ శర్మని పక్కన పెట్టారని అభిమానులు కూడా బీసీసీఐ బోర్డు పైన విమర్శలు చేశారు. కాగా తాజాగా రోహిత్ శర్మ తన సహచరులతో పాటు ఆస్ట్రేలియా పోవడానికి సమస్య కారణం కాదని, తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండటంతో రోహిత్ ఐపీఎల్ నుంచి నేరుగా ముంబై వచ్చినట్లు బీసీసీఐ చెబుతోంది. కోలుకొని ఎన్సీఏకు వెళ్లి రీహాబిలిటేషన్ ను ప్రారంభించినట్లు చెప్పింది.
కాగా తాజాగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ తనకు రోహిత్ శర్మ ఫిట్నెస్ స్టేటస్ గురించి తెలియదని అతడు, ఫిట్నెస్ గా ఉన్నాడా లేదా అనే విషయం అతనితోపాటు బోర్డు మాత్రమే తెలిసి ఉండాలని పేర్కొన్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్ గా ఉంటే ఆస్ట్రేలియాకు పంపాలని ఆయన సూచించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టులో రోహిత్ శర్మ ఉంటే బావుంటుందని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అతని సత్తా ఏంటో అందరికీ తెలుసు కాబట్టి రోహిత్ ఫిట్ నెస్ పెంచుకుంటే అతడిని ఆస్ట్రేలియాకుపంపడం ఎంతో శ్రేయస్కరం అని సూచించాడు.
ఫిజియో- మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు రోహిత్ శర్మ తో కాంటాక్ట్ లో ఉంటుంది కాబట్టి రోహిత్ శర్మ ఫిట్నెస్ ఏమిటనేది వారికి అవగాహన ఉంటుందని, రోహిత్ ఫిట్నెస్ పై వారే సమాధానం చెప్పాలని సచిన్ అన్నాడు. రోహిత్ మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధంగా ఉంటే అతడిని ఆస్ట్రేలియాకు పంపడం ఎంతో ఉత్తమమని, ఎంతో నైపుణ్యం ఉన్న రోహిత్ జట్టులో టెస్టుల్లో సమతూకంగా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ రోహిత్ ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. విరాట్ కోహ్లీ గైర్హాజరీ అవనుండడంతో కనీసం రోహిత్ శర్మ అయినా జట్టులో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.