‘కోవిడ్’ ఉంటే శృంగారంలో పాల్గొనవచ్చా?
దేశంలో కరోనా ఏ స్థాయిలో పెరిగిపోతుందో చూస్తునే ఉన్నాం. మన చుట్టుపక్కలే చాలామంది కరోనాతో బాధపడుతున్నారు. ఇక ఏ టెస్టులు చేయించుకోకుండా .. ఇంట్లోనే ఉండి మందులు వాడుతున్న వారూ ఉన్నారు. మరికొందరేమో ఏ లక్షణాలు లేకుండా కరోనా బారిన పడుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కరోనా వచ్చినవాళ్లు శృంగారంలో పాల్గొనవచ్చా?కోవిడ్ ట్రీట్ మెంట్ తీసుకొని నెగిటివ్ వచ్చిన తర్వాత శృంగారం చేసుకోవచ్చా? చాలా మందికి ఇటువంటి సందేహాలు తలెత్తుతున్నాయి.
కరోనా టైంలో చాలా మందికి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే ఎంత కాలానికి శృంగారంలో పాల్గొనవచ్చు అనే విషయంపై వారిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో డాక్టర్లు ఏం చెబుతున్నారో ? ఇప్పుడు తెలుసుకుందాం.కోవిడ్ వచ్చిన వాళ్లు ఈ వ్యాధి నుంచి కోలుకున్నాక.. కనీసం నెలరోజులు శృంగారానికి దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. కోవిడ్ వచ్చిన వారి వీర్యకణాలు, అండాల్లో కరోనా వైరస్ ఉంటుందా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇందుకు సంబంధించి పలు అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే కరోనా వచ్చి తగ్గాక కూడా శరీరంలో వైరస్ ఉంటుంది కాబట్టి. శృంగారానికి దూరంగా ఉండటం ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు.కోవిడ్ బారిన పడినవాళ్లలో వీర్యకణాల సంఖ్యే తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలో సంతానం కోసం ప్రయత్నించకపోవడం ఉత్తమమని డాక్టర్లు సూచిస్తున్నారు.నవ దంపతులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే శృంగారంలో పాల్గొనాలి కాబట్టి. కోవిడ్ నెగిటివ్ వచ్చిన నెలరోజుల అనంతరం సెక్స్ లో పాల్గొనడం ఉత్తమమని డాక్టర్ల సూచిస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాలుగు వారాల వరకు శృంగారంలో పాల్గొనకపోవడం ఉత్తమని డాక్టర్లు చెబుతున్నారు.గర్భిణులు, బాలింతలు కూడా వ్యాక్సిన్లు తీసుకోకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. ఎందుకంటే వారిమీద క్లినికల్ ట్రయల్స్ జరగలేదు. పీరియడ్స్ టైంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.