కరోనా కన్నీటి కష్టాలు..ఆకలి తీర్చుకోవడానికి కర్ర తిప్పుతున్న బామ్మ!
కరోనా వైరస్ మహమ్మారి ..ప్రతి ఒక్కరి జీవితంలో భారీ మార్పులని తీసుకువచ్చింది. ముఖ్యంగా కరోనాను అరికట్టడానికి లాక్ డౌన్ విధించడం తో చాలామంది అనేక కష్టాలు పడుతున్నారు. చేసేదానికి పనిలేక ..తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా కొంతమంది తమ ఆత్మాభిమానాన్ని వదులుకోకుండా సొంత కాళ్లపైనే నిలబడుతున్నారు. పుణెకు చెందిన శాంతాబాయి పవార్ కూడా ఈ కోవకే చెందినవారే. ఈమె ఎనిమిది పదుల వయసులోనూ శక్తిని కూడదీసుకుని తనకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కాలంలోనూ ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో కర్రసాము చేస్తూ , కడుపు నింపుకుంటుంది. ఆ బామ్మ కర్రసాము చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ వీడియో ను రితేష్ దేశ్‌ముఖ్ ఇటీవలే ఆ వీడియో షేర్ చేసి ఆ యోధురాలు వివరాలు చెప్పగలరా అని కోరారు. దాంతో ఆమెను వెతికే పనిలో మునిగి పోయిన అభిమానులు చివరికి ఆమె జాడ కనుక్కున్నారు. ఆమె పూణె కు చెందిన శాంతాబాయి పవార్ అని తీవ్రమైన ఆర్థిక కష్టాల వల్ల ఇలా తనకు తెలిసిన విద్యను చూపించి జీవితం కొనసాగిస్తోందని తెలిపారు. ఇక శాంతాబాయి వివరాలు తెలియడంతో తన టీం ఆమెను కలిసేందుకు వెళ్లిందని.. ఆమెది చాలా గొప్ప కథ అంటూ రితేశ్ తన ఫాలోవర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె ట్యాలెంట్ కు సోషల్ మీడియా మొత్తం ఫిదా అయి ఆమెకు అండగా నిలుస్తోంది.