• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నా చావుకు మమతాబెనర్జీనే...

నా చావుకు మమతాబెనర్జీనే కారణం

By - Tupaki Desk
Update: 2019-02-25 10:18 GMT
1986వ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కోల్ కతా పోలీస్ ఉన్నతాధికారి గౌరవ్ దత్ ఫిబ్రవరి 19న ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కారణం బెంగాల్ సీఎం మమతాబెనర్జీనే కారణమంటూ సూసైడ్ నోట్ లో రాశాడు. ఇప్పుడీ సూసైడ్ నోట్ దుమారం రేపుతోంది.

మమతా బెనర్జీ తనకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టారని.. గత డిసెంబర్ 31న పదవీ విరమణ చేశాక కూడా తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను నిలిపివేశారని సూసైడ్ నోట్ లో దత్ ఆరోపించారు. నా చావుకు మమతా బెనర్జీయే కారణమని పేర్కొన్నారు.

ఇప్పుడీ సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. దత్ భార్య  స్థానిక బీజేపీ నేత ముకుల్ రాయ్ తో కలిసి సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్ మండిపడ్డారు. వెంటనే మమతను అరెస్ట్ చేయాలని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బెంగాల్ చరిత్రలోనే సీఎం ఒత్తిడి వల్ల ఓ ఐపీఎస్ ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని అన్నారు.

మంగళవారం కోల్ కతా లోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న దత్ నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. చేతిని కట్ చేసుకొని రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి భార్య షాక్ కు గురైంది. ఇప్పటికే సీబీఐతో నువ్వా నేనా అన్నట్టు ఫైట్ చేస్తున్న మమతకు ఐపీఎస్ ఆత్మహత్య మెడకు చుట్టుకున్నట్టైంది. ప్రస్తుతం కోల్ కతా వాతావరణం ఆందోళనకరంగా ఉంది.
    

Tags:    
  • Retired IPS Officer 
  • Gaurav Dutt 
  • Suicide 
  • Mamata Banerjee 
  • Suicide Note 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS