మర్కజ్‌ ప్రార్థనల్లో దారుణం..వైరస్‌ పెరగడానికి వారి తీరే కారణం

Update: 2020-04-05 07:16 GMT
లాక్‌ డౌన్‌ తో భారతదేశంలో కరోనా వైరస్‌ అదుపులోకి వస్తున్న సమయంలో ఒక్కసారిగా దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరిగిపోయాయి. దానికి కారణం ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో వేల మంది ఒకేసారి గుమిగూడి ప్రార్థనలు చేయడమే. ఆ ప్రార్థనల్లో కరోనా వైరస్‌ సోకిన వారు కూడా ఉండడంతో వారి వలన గుమిగూడి ఉన్న వారికి కూడా సోకింది. వారి సంఖ్యలో వేలల్లో ఉండడంతో ఇప్పుడు వారి ద్వారా భారతదేశంలో కరోనా వైరస్‌ పంజా విసరుతోంది. అందుకే వందల్లో ఉన్న కరోనా వైరస్‌ కేసులు ఇప్పుడు మూడు వేలకు చేరింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా రోజూ వందల మంది కరోనా బాధితులు తేలుతున్నారు. ఆ కేసుల్లో ఈ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారే అధికంగా ఉన్నారు.

దీంతో ఒక్కసారిగా మర్కజ్ ప్రార్థనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఒకేసారి అంతమందికీ కరోనా సోకడానికి కారణమైన నిర్వాహకులపై ప్రజలు మండిపడుతున్నారు. అయితే ఆ ప్రార్థనల్లో ఏం జరిగింది? ఎందుకు ఇంతలా వైరస్‌ పాకింది అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. దీనికి సంబంధించిన సంచలన విషయం ఒకటి వ్యాపించింది. మర్కజ్ ప్రార్థనల సమయంలో వారు ఏ విధంగా ఉన్నారు? ఏం పనులు చేశారో ఆ ప్రార్థనల్లో పాల్గొన్న ఓ వ్యక్తి చెప్పారు. ఆ వ్యక్తి చెప్పిన వివరాలు చదివితే ఆశ్చర్యమేస్తోంది. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న వేళ కూడా వారు నిర్లక్ష్యంగా.. ఇష్టారీతిన వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

ఆ ప్రార్థనల సమయంలో ఒక పెద్ద ప్లేటులో ఆహార పదార్థాలు పెట్టుకుని ఒకేసారి నలుగురు తినారంట - అనంతరం వారి భోజనం పూర్తి చేశాక.. ఆ ప్లేటు కడగకుండానే మరికొంత మందికి అదే దానిలో వడ్డించారంట. ఆ విధంగా దాదాపు ఆరేడు సార్లు పలు మంది తిన్నారంట. ఆ విధంగా ఆ ప్రార్థనలు జరిగినన్నాళ్లు ఆ ప్లేటులోనే ఈ విధంగా వందల మంది తిన్నారు. దీంతో పాటు టాయిలెట్ల వద్ద ఇంకా దారుణ విషయం వెలుగులోకి వచ్చింది.

టాయిలెట్ల కోసం కొన్ని నిమిషాల పాటు వరుసలో నిలబడ్డారంట. ఒకరు పోసిన తర్వాత మరొకరు పోయడానికి దాదాపు అర్థగంట పాటు వేచి ఉన్నారంట. అయితే టాయిలెట్ల దగ్గర నిరంతరం విసర్జన చేస్తుండడంతో అక్కడ దుర్గంధం వెదజల్లింది. అసలు విరామం లేకుండా పదుల సంఖ్యలో నిలబడ్డామని ఆ వ్యక్తి చెప్పారు. ఇక ప్రార్థనల సమయంలో బహిరంగ ప్రదేశంలో వేల సంఖ్యలో గుమికూడి ఉన్నారు. అక్కడ మైదానంలో ప్రజలు కిక్కిరిసి ఉంది. ఆ ప్రాంతంలో ఖాళీ స్థలం లేదు. వేలమందితో ఆ మైదానం నిండిపోయిందంట. ఇక ప్రార్థనల తర్వాత ట్రైన్‌ లో ఒకరి పక్కన ఒకరం కూర్చుని ప్రయాణం చేశారు. దీంతో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా.. మిగతా వాళ్లందరికీ సోకకుండా ఆగలేదని ఆ వ్యక్తి కొన్ని మీడియాతో మాట్లాడారు. ఈ విధంగా వారు వ్యవహరించడంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది.

Tags:    

Similar News