• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రియల్ క్రైమ్: ఆస్తి కోసం...

రియల్ క్రైమ్: ఆస్తి కోసం కోడలు దారుణం

By - Tupaki Desk
Update: 2019-10-06 08:26 GMT
ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే ఒకరి తర్వాత ఒకరిని పకడ్బందీ ప్లాన్లతో హత్య చేసిన మాయలేడీ కేసును పోలీసులు ఛేధించారు. 14 ఏళ్ల వ్యవధిలో తన రెండో భర్త సాయంతో మహిళ ఈ హత్యలను చేసినట్టు తెలిసి పోలీసులే విస్తుపోయారు.

కేరళలోని కోచికోడ్ లో 2002 నుంచి 2016 వరకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల హత్య మిస్టరీని కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. అనుమానాస్పదంగా మరణించిన కుటుంబంలోని ఆరుగు వ్యక్తుల హత్యకు ఆ ఇంటి కోడలు సూత్రధారి అని తేల్చారు.

కేరళకు చెందిన జోలీ అనే ఓ ఇంటి కోడలు ఈ హత్యలను పకడ్బందీగా చేసింది. 2002లో జోలి అత్త అయిన రిటైర్డ్ టీచర్, అన్నమ్మ థామస్ అనే మహిళ కుప్పకూలి చనిపోయారు. ఆమెది సహజమరణంగా అందరూ భావించారు. ఆ తర్వాత  అదే ఇంట్లో జోలి అత్త భర్త టామ్ థామస్ గుండె పోటుతో మరణించారు. 2011లో జోలి భర్త రాయ్ థామస్ కూడా ఇదే తరహాలో మరణించారు. ఇక 2014లో అత్త సోదరుడు మాథ్యూ కూడా ఇలాగే మరణించాడు. ఇక 2016లో వారి బంధువుల కుమార్తె రెండేళ్ల అల్ఫాన్సా కూడా గుండెపోటుతో మరణించింది. ఆమె తల్లి సిల్లీ కూడా అసవులు బాసింది.

ఈ హత్యలన్నింటిపై అనుమానం రావడం కేరళలో కలకలం రేపింది. ఈ హత్యలను కోడలు జోలి చేసిందనే విమర్శలు వచ్చాయి. జోలి వారి కుటుంబ ఆస్తిని తన పేరున మార్పిడి చేసుకుంది. అయితే జోలి మామ టామ్ చిన్నకుమారుడు అమెరికాలో  ఉండగా.. ఈ మరణాలపై అనుమానం వచ్చి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెనైడ్ సాయంతోనే జోలి ఈ ఘాతుకానికి పాల్పడిందని తేల్చారు.

ఇలా ఆస్తి కోసం సొంత అత్తా, మామలు, కట్టుకున్న భర్త వారి కుటుంబ సభ్యులందరినీ చంపిన కోడలు జోలి కేసును పోలీసులు అతికష్టం మీద తేల్చారు. జోలిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Tags:    
  • joily case 
  • kerala 
  • india 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS