పెట్రో మంటపై ప్రజలు చేయాల్సిన పనిని ఆర్ బీఐ చేసిందిగా
దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ఇటీవల కాలంలో తాము నమ్మిన కుందేటికి మూడు కాదు రెండు.. కాదు కాదు ఒక్క కాలు అని నమ్మేయటమే కాదు.. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ఎదవ ప్రచారం చేయటం ఎక్కువైంది. సంబంధంలేని అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. తాము చెప్పే కహానీకి సరిపడా మసాలా దంచేస్తున్న అతిగాళ్ల తీరు ఈ మధ్యన ఎక్కువైంది. ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో పెట్రో వాతలు పెడుతున్న మోడీ సర్కారును వెనకేసుకొస్తూ.. మిగిలిన అంశాల్ని వదిలేసి.. దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేదా? అన్న పనికిమాలిన వాదనను వినిపిస్తున్నారు.
ఎందుకిలా అంటే.. ఇలాంటి సలహాలు.. సందేశాలు ఇచ్చే వారెవరూ కూడా దేశం కోసం తమ ఆస్తుల్లో సగాన్ని మోడీ సర్కారుకు ధారాదత్తం చేయట్లేదు. ఇలాంటి మాటలు చెప్పే వారంతా డ్రాయింగ్ రూంలో కూర్చొని కులాశగా కబుర్లు చెప్పేవారే కానీ.. కష్టాలు పడే వారు కాదు. ఒక సామాన్యుడు... మధ్యతరగతి జీవి పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలకు కిందామీదా పడుతున్నారు. చాలామంది తినే తిండి మీద కూడా దీని ప్రభావం పడి విలవిలలాడిపోతున్నారు.
కాలే కడుపుతో అవస్తలు పడుతున్న వారి గురించి పట్టించుకోకుండా.. దేశం.. దేశభక్తి లాంటి మెలోడ్రామా మాటలు మాట్లాడి.. ఎదుటివాడి వేదనల్ని వినని వారికి చురుకు పుట్టేలా భారత రిజర్వు బ్యాంక్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ.. పన్నుల తగ్గింపుపై ఆర్ బీఐ ఏమందంటే.. ''ఇంధన ధరల్ని తగ్గించే దిశగా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా పెట్రోల్.. డీజిల్ పై విధించే పరోక్ష పన్నుల్ని తగ్గించొచ్చు. ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవం. కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితులతో ఆదాయం.. ప్రభుత్వ ఖర్చుల్ని కూడా అర్థం చేసుకోవచ్చు. వీటిని తగ్గించకపోతే మళ్లీ ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది'' అని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు.
కొంతకాలంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికీ.. ఇంధన ధరల వల్ల రానున్న రోజుల్లో తయారీ.. ఉత్పత్తి రంగంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న ఆందోళన చేశారు. గడిచిన పది రోజులుగా ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయని.. కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ రూ.100కు చేరువైందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పై 60 శాతం.. డీజిల్ పై 56 శాతం పన్నుల భారాన్ని విధిస్తున్నాయి. ఆర్ బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వింటే.. దేశం కోసం అని మాట్లాడే అతిగాళ్లు.. ఆర్ బీఐకి కూడా దేశభక్తి లేదంటారేమో?