• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'ముష్కిల్' కు వందశాతం...

'ముష్కిల్' కు వందశాతం హామీ వచ్చేసింది!

By - Tupaki Desk
Update: 2016-10-21 04:17 GMT
పాకిస్థాన్ నటులు ఉన్న "ఏ దిల్ హై ముష్కిల్" సినిమాను విడుదల కానివ్వమంటూ ఇప్పటికే ఎవరికితోచిన స్థాయిలో వారు నిషేదం విధించారు. నిజంచెప్పాలంటే ఉడీ గురదాడుల అనంతరమే పాకిస్థాన్ నటులను నిషేదించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది... కానీ అప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమాల పరిస్థితి ఏమిటి? నిజం చెప్పాలంటే ఉడీ ఉగ్రదాడికి ముందు పాక్ నటులు బాలీవుడ్ లో భారతీయ నటుల మాదిరే చలామణి అయ్యరు కూడా! ఈ క్రమంలో ఉడీ ఉగ్రదాడి అనంతరం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) సీరియస్ గా స్పందించింది, పాకిస్థాన్ నటీనటులు ఉన్న బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది, ఆ సినిమాలను విడుదల కానివ్వమని తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిని రాజ్ నాథ్ సింగ్ ని కలిశారు దర్శకనిర్మాత మహేశ్‌ భట్ నేతృత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా, ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్ తదితరులు.

ఈ భేటీ అనంతరం స్పందించిన మహేశ్ భట్... మోంమంత్రి తమకు వందశాతం భరోసా ఇచ్చారని, 'ఏ దిల్ హై ముష్కిల్" సినిమా విడుదలకు అడ్డంకులు లేకుండా చూడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కోరతానని తమతో చెప్పారని వెల్లడించారు. ఇదే సమయంలో సినిమా విడుదలవుతున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడి ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కాగా... కరణ్ జోహార్ తెరకెక్కించిన "ఏ దిల్ హై ముష్కిల్"లో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడన్న కారణంతో  ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దెబ్బతో వెనకా ముందు చూడకుండా, వాస్తవాలు ఆలోచించకుండా ఎమోషన్స్ తో కూడిన నిర్ణయాలు తీసుకుంటే తదనంతర పరిణామాలు ఇలానే ఉంటాయని ఎమ్మెన్నెస్ కు ఈ దెబ్బతో తెలిసొచ్చిందని పలువురు బీజేపీ నేతలే ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారని కథానాలు రావడం గమనార్హం. దీంతో రాజ్ నాథ్ సింగ్ తీసుకున్న నిర్ణయంతో కరణ్ జోహార్ కు ఎంత ఆనందం కలిగి ఉంటుందో, ఎమ్మెన్నెస్ కు అంతలా షాక్ తగిలి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతునారు.

ఇదే క్రమంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పై కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియో ఫైరయ్యారు. సినిమా ధియేటర్లపై దాడులు చేసే హక్కు ఎమ్మెన్నెస్ కు లేదని, అది రౌడీల పార్టీ అని అందుకే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. అసలు ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో, ఏ సినిమా చూడకూడదో నిర్ణయించే హక్కు ఎమ్మెన్నెస్ లేదని పేర్కొన్నారు. ఉడీలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాతే పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిందే కానీ, ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలు ఇరుదేశాల సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు తెరకెక్కించినవన్న విషయం మరిచిపోకూడదని వివరించారు.
Tags:    
  • Rajnath Singh 
  • Karan Johar 
  • Ae Dil Hai Mushkil Movie 
  • Telugu News 
  • MNS 
  • Bollywood 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS