అన్న ఇక్కడ...చెల్లెలు అక్కడ... అదిరిపోయే ప్లాన్..!
దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ఎన్నిక నుంచి ఎన్నిక అన్నట్లుగానే వర్తమాన రాజకీయాలు కొనసాగుతున్నాయి. కేంద్రంలో మోడీ సర్కార్ రెండేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ళ పాటు అధికారమంలో ఉంటుంది. అయినా కానీ ఇప్పటి నుంచే బీజేపీ, కాంగ్రెస్ వచ్చే ఎన్నికల కోసం రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి రాజకీయాన్ని మొత్తం తనకు అనుకూలం చేసుకోవాలని చూస్తోందిట. 2014, 2019లలో చేసిన తప్పులు మరో మారు చేయకుండా కాంగ్రెస్ పక్కా యాక్షన్ ప్లాన్ తో సిద్ధమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ గ్లామర్ ని అంతా ఒకే వైపు ఉంచకుండా.. మొత్తం భారతానికి పంచడానికి కాంగ్రెస్ వ్యూహకర్తల టీమ్ బహు చక్కని వ్యూహాన్ని రచిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ కుటుంబమే అతి పెద్ద ఆకర్షణ. వచ్చే ఎన్నికల వేళకు సోనియా గాంధీ ప్రచారం ఎంతమేరకు చేస్తారో తెలియదు కానీ కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ మాత్రం ఆశాకిరణాలుగా ఉన్నారు. ఈ ఇద్దరినీ రెండు కళ్ళుగా చేసుకుని కాంగ్రెస్ తన మొత్తం ప్రచారాన్ని అదిరిపోయే రేంజిలో సాగించనుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ సౌత్ కి... ప్రియాంకా గాంధీ నార్త్ కి అన్నట్లుగా విభజించి మరీ వ్యూహాలకు తెరదీస్తోందట. కాంగ్రెస్ కి సౌత్ ఒకనాడు పెట్టని కోట. ఇపుడు కూడా అటువంటి వాతావరణమే ఉంటుందని భావిస్తున్నారు. ఈ రోజు కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా ఎదురుగాలులు వీస్తున్నాయి. దాంతో అక్కడ నుంచి కాంగ్రెస్ జైత్ర యాత్ర మొదలుపెట్టి తెలంగాణా మీదుగా ఏపీ, తమిళనాడు, కేరళలుగా సాగాలని చూస్తోంది. రాహుల్ గాంధీ ఈ రాష్ట్రాలలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ప్రచారం చేపడతారు అంటున్నారు. రాహుల్ కేవలం ఈ రాష్ట్రాలకే కట్టుబడి మొత్తం రాజకీయం అంతా ఇక్కడే అన్నట్లుగా తిరిగితే మాత్రం సౌత్ పొలిటికల్ సీన్ మొత్తానికి మొత్తంగా మారే అవకాశం ఉంది.
పైగా రాహుల్ ప్రస్తుతం కేరళ నుంచే లోక్‌సభకు కూడా ప్రాథినిత్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అమేథి నుంచి స్మృతి ఇరానీ మీద ప్రియాంక పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఆమె ఇప్పటికే యూపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. నాయనమ్మ ఇందిరాగాంధీ ముఖ వర్చస్సు కలిగిన ప్రియాంకా గాంధీ ఉత్తరాదిని తన ప్రచారంతో ఊపేస్తారు అంటున్నారు. అక్కడ కూడా బీజేపీ కోటలకు బీటలు వారుతాయి అన్న సంకేతాలు ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ బ్రహ్మాండమైన ప్లాన్ వేసింది అంటున్నారు. మొత్తానికి అన్నా చెల్లెలు కనుక ఇలా విభజంచుకుని మరీ విజృంభిస్తే ఖచ్చితంగా హస్తవాసి మారే అవకాశం ఉంది అంటున్నారు.