• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ కౌగిలి కోసం ట్రంప్...

మోడీ కౌగిలి కోసం ట్రంప్ ఎదురుచూస్తున్నాడ‌ట‌

By - Tupaki Desk
Update: 2017-10-16 05:29 GMT
పాకిస్థాన్ కొన్ని ఏళ్ల‌ తరబడి అమెరికా నుంచి భారీగా లబ్ధి పొందిందని - ఇప్పుడు ఆ దేశంతో అసలైన బంధం ప్రారంభమైందని అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ వ్యాఖ్యానించ‌డం - పాక్‌ తో సంబంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తామని చేసిన ట్వీట్‌ పై క‌ల‌క‌లం ఇంకా కొన‌సాగుతోంది.``పాక్‌ తోనూ - ఆ దేశ నేతలతోనూ మరింత సత్సంబంధాల మెరుగుదల ప్రారంభమైంది. పాకిస్థాన్ బహుముఖ సహకారానికి ధన్యవాదాలు`` అని ట్రంప్ ట్వీట్‌ చేశారు. హక్కానీ నెట్‌ వర్క్ ఉగ్రవాద సంస్థ నుంచి ఓ కుటుంబాన్ని కాపాడినందుకు ట్రంప్ ఇలా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో స్పందించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌ పై రాహుల్ గాంధీ స్పందిస్తూ... ``మోడీజీ త్వరపడండి. ప్రెసిడెంట్ ట్రంప్‌ కి మరొక ఆలింగనం అవసరమేమో``.. అని అన్నారు. పాక్ విషయంలో ట్రంప్ యూ-టర్న్ తీసుకున్నారని ఆరోపిస్తూ.. మోడీ పై రాహుల్ ఇలా వ్యంగ్యాస్ర్తాన్ని విసిరారు. కాగా, అమెరికా నిఘా వర్గాలిచ్చిన సమాచారం ఆధారంగా పాక్ దళాలు హక్కానీల చెర నుంచి అమెరికన్ పౌరురాలు కెయిట్లన్ కోల్‌ మన్ - ఆమె భర్త కెనడా జాతీయుడు జాషువా బాయిల్ వారి ముగ్గురు పిల్లలను రక్షించాయి. ఆఫ్ఘనిస్థాన్ సందర్శనకు వచ్చిన ఈ దంపతులను 2012లో ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. ఉగ్రవాదుల చెరలోనే వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు.

కాగా, ఇటీవల ట్రంప్ ఆఫ్ఘన్ - దక్షిణాసియా విధానాన్ని ప్రకటించినప్పుడు, ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతును కొనసాగిస్తున్నదని, అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజా పరిణామాల తర్వాత ఆయన పాక్ నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ - పాక్‌ తో సంబంధాలు మెరుగుపడుతున్నాయని, పలు అంశాల్లో తమకు సహకారం అందిస్తున్నారని శుక్రవారం ట్వీట్ చేశారు. వారు అమెరికాను గౌరవించడం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే రాహుల్ తాజా సెటైర్ వేశారు.
Tags:    
  • Rahul Gandhi 
  • Modi 
  • Donald Trump 
  • Telugu NEWs 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS