• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాహుల్‌ జీ! ఈ ఛాన్స్...

రాహుల్‌ జీ! ఈ ఛాన్స్ మిస్సయితే జీవితంలో లేవలేం!!

By - Tupaki Desk
Update: 2018-02-19 09:33 GMT
చేసిన పాపం  చెబితే పోతుందంటారు! కానీ ఇది అలాంటి ఇలాంటి పాపం కాదు. మరి అలాంటప్పుడు చేసిన పాపాన్ని చెరపి వేసుకునే చాన్సు వచ్చింది. నష్టం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఈ అవకాశాన్ని వాడుకోవడం వల్ల కొత్తగా వచ్చే నష్టం లేదు. సమర్థంగా వాడుకుంటే మళ్లీ ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకోవచ్చు. పడిపోయిన తమ పార్టీని మళ్లీ లేపి నిలబెట్టవచ్చు. ఇదీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందున్న పరిస్థితి. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ కు అసలు స్థానం లేకపోయినప్పటికీ.. ఇక్కడ శరవేగంగా మారుతున్న పరిణామాలు, వ్యూహాల్లో తాము కూడా భాగం కాగలిగితే.. రాష్ట్రంలో మళ్లీ తమ ఉనికి తమకు దక్కగలదనే ఆశ వారిలో మొగ్గ తొడుగుతోంది.

పవన్ కల్యాణ్ కమిటీ రెండు రోజుల కసరత్తు చేసిన తర్వాత.. ఉండవిల్లి- పవన్ కలిసి ప్రతిపాదించిన అవిశ్వాసం ప్రతిపాదన అనే అంశం.. తెలుగు రాష్ట్రం రాజకీయాల్లో బాగా చెలామణీ అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ – ‘మేం రెడీ అవిశ్వాసం పెడతాం’ అంటున్నారు గానీ.. వారికి చాలినంత బలం లేదు. తీర్మానం పెట్టాలంటే 54 మంది సభ్యల మద్దతుండాలి. తెదేపా-వైకాపా ఇద్దరూ కలిసినా సరిపోదు. ఇలాంటి నేపథ్యంలో తాము ఎడ్వాంటేజీ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రానికి న్యాయం  జరగడానికి అవిశ్వాసం ఒక మార్గం అని అందరూ నమ్ముతున్నప్పుడు.. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు కలిసినా ఆ పని జరగడం సాధ్యం కాని పరిస్థితి ఉన్నప్పుడు తాము పూనుకుని.. కార్యం చక్కబెడితే రాష్ట్రప్రజల వద్ద మార్కులు కొట్టేయవచ్చుననేది వారి ఆలోచన. ఈ మేరకు ఈ ప్లాన్ ను ఏపీ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారని.. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారని చెప్పుకుంటున్నారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీ ఏపీలో సర్వనాశనం అయిపోయిన తర్వాత.. ఈ రాష్ట్ర పార్టీ వ్యవహారాల గురించి రాహుల్ పట్టించుకోవడం మానేశారనే అనాలి. ఎప్పటికైనా ఇక్కడ పార్టీ తిరిగి నిలదొక్కుకోవడం అసాధ్యం అని వారు ఫిక్సయిపోయినట్లే ఇప్పటిదాకా వాతావరణం గడిచింది. అయితే ప్రస్తుతం ఈ అవిశ్వాసం సువర్ణావకాశం అని.. నిజానికి అందుకు తగినంత బలం.. కాంగ్రెస్ కు సొంతంగా లేకపోయినప్పటికీ.. యూపీఏ పక్షాలను ఒప్పించి అయినా.. వైకాపా, తెదేపా లు మద్దతివ్వాలని కండిషన్ పెట్టి అయినా పావులు కదిపితే.. కాస్త ప్రజలను ఇంప్రెస్ చేయవచ్చునని అనుకుంటున్నారట.
Tags:    
  • Rahul Gandhi 
  • Aviswasa Theermanam 
  • No Confidence Motion 
  • AP Politics 
  • AP Political News 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS