• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  స్టీల్ ప్లాంట్...

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే.. కేంద్రం ముందుకే..

By - Tupaki Desk
Update: 2021-02-24 14:30 GMT
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీలో జరుగుతున్న ఆందోళనలను అస్సలు పట్టించుకోవడం లేదు. విశాఖపట్నం ప్రజలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల నిరసనలు.. ఆందోళనలను లైట్ తీసుకుంటోంది.  ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రణాళికతోనే ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం.. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రం బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు సమాచారం.  సాంకేతిక వివరాలు, ప్లాంట్ సామర్థ్యం.. దాని ఆస్తులను బిడ్ పత్రంలో చేర్చడానికి సమర్పించాలని పరిశ్రమల శాఖను పిలుపునిచ్చినట్టు తెలిసింది..

వివరాలు అందిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ప్రైవేటు సంస్థలను పిలవాలని కేంద్రం డిసైడ్ అయ్యింది.  ఆసక్తి గల పారిశ్రామిక సంస్థలు బిడ్ వేయాలని కేంద్రం పిలుస్తుందని వర్గాలు తెలిపాయి.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రం తీసుకున్న చర్యను ఏపీలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రైవేటీకరించే ప్రణాళికను విరమించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ ప్రణాళికను నిలిపివేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. జగన్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయగా, ఆయన మంత్రివర్గం మంగళవారం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించింది.

అయినప్పటికీ, కేంద్రం ఏపీలో జరుగుతున్న ఆందోళనలను, పార్టీల ప్రయత్నాలను లైట్ తీసుకుంటున్నట్టు కనబడుతోంది. ఉక్కు కర్మాగారాన్ని వదిలించుకోవడానికి.. ప్రైవేటు పార్టీలకు అప్పగించడానికి కేంద్రం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
Tags:    
  • Vizag Steel 
  • Latest news 
  • Tupaki News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki Updates 
  • Daily Reports 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS