భారత్ వార్నింగ్ ను లెక్క చేయని కెనడా ప్రధాని
సాధారణంగా ఒక దేశంలో చోటు చేసుకునే నిరసనలు.. ఆందోళనల విషయంలో వేరే దేశాల వారు జోక్యం చేసుకోవటాన్ని ఏ దేశం ఒప్పుకోదు. అవసరానికి మించిన అత్యుత్సాహం అస్సలు పనికి రాదు. కానీ.. అలాంటి హద్దుల గీతల్ని దాటేస్తున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఢిల్లీ శివారులో రైతులు చేస్తున్న నిరసనలకు తమ మద్దతు ఉంటుందని చెప్పిన సంచలనంగా మారిన ట్రూడో.. మరోసారి భారత్ కు మంటపుట్టే వ్యాఖ్యలు చేశారు.
మోడీ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇటీవల కెనడా ప్రధాని ట్రూడో లేవెనెత్తి.. ప్రపంచంలో ఏ మూలన జరిగే శాంతియుత ఆందోళనకు కెనడా మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యపై పెను దుమారం రేగింది. మోడీసర్కారు తీవ్రంగా స్పందించింది. ఘాటు హెచ్చరికను చేసింది. అయినప్పటికీ.. అవేమీ పట్టించుకోనట్లుగా మరోసారి వ్యవహరించారు.
తాజాగా రైతుల నిరసనకు మద్దతు ఇవ్వటంపై భారత్ లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది కదా.. దీనిపై స్పందన ఏమిటంటూ జస్టిన్ ట్రూడోను అక్కడి జర్నలిస్టులు ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఆయన.. ‘‘శాంతియుతంగా నిరసన ప్రపంచంలో ఎక్కడ జరిగినా కెనడా మద్దతు ఇస్తుంది. ఏ సమస్యనైనా చర్చలతో పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’’ అని వ్యాఖ్యానించారు.
ఓవైపు ఆయన మాటల్ని భారత ప్రభుత్వం ఖండిస్తోంది. మరోవైపు ఆయన స్పందనపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివేళలోనూ వెనక్కి తగ్గని కెనడా ప్రధాని.. తాజాగా మరోసారి మద్దతు ఇవ్వటం షాకింగ్ గా మారింది. ఇప్పటికే రైతులు చేస్తున్న నిరసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మోడీ సర్కరుకు కెనడా ప్రధాని రూపంలో మరో సవాలు ఎదురైందని చెప్పక తప్పదు.